Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Chaudhary: ఈ కోమలిని జాబిల్లిగా తలచి వెన్నెల కమ్మేస్తుందేమో.. చార్మింగ్ మీనాక్షి..

మీనాక్షి చౌదరి.. ఒక కథానాయకి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె తెలుగు తమిళ చిత్రాలలో పని చేస్తుంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది. చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 1వ రన్నరప్‌గా నిలిచింది.

Prudvi Battula

|

Updated on: Feb 20, 2025 | 4:45 PM

1 ఫిబ్రవరి 1997 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో పుట్టి పెరిగింది అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మ తండ్రి B.R చౌదరి భారత ఆర్మీ సైన్యంలో కల్నల్ గా పని చేసారు. 2018 జనవరిలో అయన మరణించారు.

1 / 5
చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి. పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.

2 / 5
 చదువుకున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 గా కిరీటాన్ని పొందింది.

3 / 5
2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. 2022లో రవితేజకి జోడిగా నటించిన ఖిలాడీ డిజాస్టర్ కాగా అడివి శేష్ సరసన కనిపించిన హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది.

4 / 5
 2023లో కొలై అనే ఓ తమిళ్ సినిమా మాత్రమే చేసింది. 2024లో మహేష్ సరసన గుంటూరు కారంతో మొదలుపెట్టి లక్కీ బాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో లక్కీ బాస్కర్ బ్లాక్ బస్టర్ అయింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ బ్యూటీ

5 / 5
Follow us