- Telugu News Photo Gallery Cinema photos Movie makers are re releasing blockbuster movies with some special effects
Telugu Movies: రీ రిలీజ్ కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ జత.. ఇంతకీ ఏంటా సినిమాలు..?
ఎవరు ఔనన్నా కాదన్నా.. రీ రిలీజ్ సినిమాలకు ఈ మధ్య డిమాండ్ తగ్గిపోయింది. ఒకప్పట్లా ఎగబడి చూడ్డానికి ఫ్యాన్స్ సిద్ధంగా లేరు.. కామన్ ఆడియన్స్ అయితే కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో మరో మూడు నాలుగు బ్లాక్‌బస్టర్స్ రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వాటికి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ జత చేసి విడుదల చేస్తున్నారు. మరి అవేంటి..? ఇంతకీ ఏంటా సినిమాలు..?
Updated on: Mar 31, 2024 | 9:06 AM

రీ రిలీజ్.. రీ రిలీజ్.. వీటితో ఎంత మిగులుతుందో తెలియదు కానీ నిర్మాతలు మాత్రం పాత సినిమాలను తెగ విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మగధీర వచ్చేస్తుంది.

గతేడాది ఆరెంజ్‌ని సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్.. ఈ సారి మగధీరను అదే స్థాయిలో ఆదరిస్తారా అనేది అనుమానమే. అందుకే దీనికి చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ జరగండి పాటను దీనికి జత ఛే స్తున్నారు మేకర్స్.

రీ రిలీజ్‌లో ఆకట్టుకోవాలంటే ఏదో ఓ జిమ్మిక్ చేయాలి. అందుకే గేమ్ ఛేంజర్ పాటను మగధీరకు అటాచ్ చేసారు దర్శక నిర్మాతలు. కనీసం ఈ పాట కోసమైనా ఫ్యాన్స్ థియేటర్స్‌కు వస్తారని వాళ్ళ ఆశ. గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ విడుదలైనపుడు.. 20 ఏళ్ళ నాటి పాటను కొత్తగా జత చేసారు. అప్పుడది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

మార్చి 30న బాలయ్య, బోయపాటి బ్లాక్ బస్టర్ చిత్రం లెజెండ్ రీ రిలీజ్ చేసారు. ఎలాగూ ఎన్నికల సీజన్ నడుస్తుంది కాబట్టి దాన్ని వాడుకోవడానికి రంగంలోకి దించుతున్నారు లెజెండ్ మూవీ మేకర్స్.

అలాగే ఎప్రిల్ 12న యూత్ ఫుల్ బ్లక్ బస్టర్ హ్యాపీ డేస్ సినిమాను మరోసారి తీసుకొస్తున్నారు. దీంతో పాటు బొమ్మరిల్లు కూడా ఎప్రిల్ 16న మరోసారి విడుదల కానుంది. మరి వీటికి మునపటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.




