- Telugu News Photo Gallery Cinema photos Megastar chiranjeevi honored Guinness book world record and vishwambhara movie shooting update
Chiranjeevi: మెగాస్టార్ ఫాంటసీ.! 2025 సంక్రాంతినే టార్గెట్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర. ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి రిలీజ్ అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చినా.. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత.. మెగా టీమ్ ఏమంటోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా విశ్వంభర.
Updated on: Oct 01, 2024 | 1:01 PM

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో శరవేగంగా జరుగుతోంది.

సంక్రాంతి రిలీజ్ అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చినా.. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత.. మెగా టీమ్ ఏమంటోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైన రోజే 2025 సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్.

ఆ డెడ్‌లైన్‌ను రీచ్ అయ్యే స్పీడుతోనే షూటింగ్ పనులు కానిచ్చేశారు. రీసెంట్‌గా మెగాస్టార్ సిక్ అవ్వటంతో విశ్వంభర రిలీజ్ విషయంలో డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

చిరు చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, షూటింగ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ ఎఫెక్ట్ రిలీజ్ డేట్ మీద కూడా పడే ఛాన్స్ ఉందన్న వార్తలు రావటంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది.

వాయిదా రూమర్స్‌కు చెక్ పెట్టే ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఒక్క పాట మినహా చిరు పోర్షన్ షూటింగ్ అంతా పూర్తయ్యింది. మిగత వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు జెట్ స్పీడుతో వర్క్ చేస్తోంది మూవీ టీమ్.

కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి డేట్ మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు మేకర్స్. మెగా కాంపౌండ్ నుంచి ఇంత కాన్ఫిడెంట్‌గా వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ ఫీస్ట్ రాబోతుందన్న క్లారిటీ రావటంతో ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు మెగా అభిమానులు.




