- Telugu News Photo Gallery Cinema photos Heroine janhvi kapoor next Telugu movies shooting updates after devara success, details here Telugu Actress Photos
Janhvi Kapoor: తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా జర్నీ మొదలెట్టిన శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్.!
ఎప్పుడు.. ఇంకెప్పుడు.. అనే మాటల నుంచి.. ఇదిగో వచ్చేశారహో.. అనే మాటల దాకా సక్సెస్‌ఫుల్‌గా జర్నీ చేశారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఆమె తెలుగు ఇండస్ట్రీని పలకరించిన ఈ టైమ్‌లో.. సౌత్‌ని టచ్ చేసిన నార్త్ బ్యూటీల మీద ఫోకస్ మరింతగా పెరుగుతోంది.. ఇంతకీ ఫోకసింగ్ పాయింట్ ఏంటి అంటారా.? దేవర స్క్రీన్ మీద జాన్వీ కనిపించిన సమయం తక్కువ. కానీ ఉన్నంతలో సూపర్ పెర్ఫార్మ్ చేశారు.. ఇదీ నిన్నటి నుంచీ వైరల్ అవుతున్న టాపిక్.
Updated on: Oct 01, 2024 | 12:34 PM

ఎప్పుడు.. ఇంకెప్పుడు.. అనే మాటల నుంచి.. ఇదిగో వచ్చేశారహో.. అనే మాటల దాకా సక్సెస్‌ఫుల్‌గా జర్నీ చేశారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఆమె తెలుగు ఇండస్ట్రీని పలకరించిన ఈ టైమ్‌లో.. సౌత్‌ని టచ్ చేసిన నార్త్ బ్యూటీల మీద ఫోకస్ మరింతగా పెరుగుతోంది.. ఇంతకీ ఫోకసింగ్ పాయింట్ ఏంటి అంటారా.?

దేవర స్క్రీన్ మీద జాన్వీ కనిపించిన సమయం తక్కువ. కానీ ఉన్నంతలో సూపర్ పెర్ఫార్మ్ చేశారు.. ఇదీ నిన్నటి నుంచీ వైరల్ అవుతున్న టాపిక్. ఫస్ట్ పార్టులో నేను చాలా తక్కువ సమయమే కనిపిస్తాను.

మీరు ప్రిపేర్ అయిపోండి అని జాన్వీ ముందు నుంచే చెబుతున్నప్పటికీ.. కాస్త దిగాలుగానే కనిపించారు ఫ్యాన్స్. దేవరలో జాన్వీ స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నవారికి, కల్కిలో దిశా పాట్ని స్క్రీన్ స్పేస్ గుర్తుకొస్తోంది.

సెకండ్ పార్టులో ఆమె ఎంత మేర కనిపిస్తారనే విషయం పక్కనపెడితే ఫస్ట్ పార్టులో చాలా తక్కువ సేపే కనిపించారన్నది అందరూ విట్‌నెస్ చేసిన నిజం.. మొన్నటికి మొన్న దిశ.. ఇప్పుడు జాన్వీ.. స్క్రీన్ స్పేస్ విషయాన్ని పట్టించుకోలేదా.?

నెక్స్ట్ చరణ్ సినిమాలో అయినా జాన్వీ స్క్రీన్ స్పేస్ బాగానే ఉంటుందా? అనే మాటలు మొదలయ్యాయి ఫ్యాన్స్ లో. చరణ్ సినిమాలతో ముడిపెట్టి జాన్వీని మాత్రమే కాదు, మరో బ్యూటీని కూడా వైరల్ చేస్తున్నారు అభిమానులు.

ఆమె మరోవరో కాదు కియారా అద్వానీ. వినయవిధేయరామలో నిరాశపరచిన చెర్రీ, కియారా కాంబో, నెక్స్ట్ గేమ్ చేంజర్లో అయినా మెప్పిస్తుందా అనే మాటలు మొదలయ్యాయి. భరత్ అనే నేను తర్వాత సౌత్‌లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

నార్త్ లో ఇటీవల స్త్రీ2తో మెప్పించిన శ్రద్ధాకపూర్ పరిస్థితి కూడా ఇంచుమించు వీరిలాగానే ఉంది. సాహో సినిమా ఓవరాల్ కలెక్షన్ల పరంగా ఓకే అనిపించినా, మన దగ్గర మాత్రం అంతగా ఆడలేదు.

సో, శ్రద్ధాకపూర్‌ని ఇక్కడ పట్టించుకున్నవారు లేరు. సౌత్‌లో ప్రూవ్ చేసుకోవాలంటే సాలిడ్ హిట్‌తో పాటు మంచి స్క్రీన్ స్పేస్ కూడా కంపల్సరీ అనే విషయాన్ని ఉత్తరాది భామలు అర్థం చేసుకుంటున్నట్టేనా.. ఇప్పుడు ఇదో పెద్ద చర్చ.




