Chiranjeevi: యంగ్ డైరెక్టర్స్ ని లైన్లో పెట్టిన మెగాస్టార్.. అనిల్ రావిపూడి, ఓదెల శ్రీకాంత్..
మెగా స్టార్ చిరంజీవి స్టైల్ మార్చారు. గతంలో సీనియర్ దర్శకులు, తనకు బాగా సింక్ అయిన టెక్నీషియన్స్‌తోనే వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించిన చిరు, ఇప్పుడు డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. యంగ్ జనరేషన్‌తో పోటీ పడాలంటే యంగ్ టీమ్‌తో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. అందుకే వరుసగా కుర్ర దర్శకులతో సినిమాలు లైన్‌లో పెడుతున్నారు. ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి.