- Telugu News Photo Gallery Cinema photos Mega plan for Padma Vibhushan award celebration for Chiranjeevi soon
Chiranjeevi: పద్మ విభూషణ్ మెగా వేడుకకు భారీ ప్లాన్.. ఈవెంట్ ఎప్పుడంటే ??
చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీ భారీ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తుందని దిల్ రాజు స్వయంగా చెప్పారు. అయితే ఈ వేదికను ఇండస్ట్రీ శ్రేయస్సుకు ఉపయోగపడేలా మలుచుకోవాలని పెద్దలు భావిస్తున్నారా..? చిరు వేడుకలో స్వామికార్యం స్వకార్యం రెండూ పూర్తి చేయబోతున్నారా..? అసలెప్పుడు ఉండబోతుంది చిరంజీవి పద్మ విభూషణ్ ఈవెంట్..? మూడు నాలుగు రోజులుగా చిరంజీవి ఇల్లు పర్యాటక కేంద్రంగా మారిపోయింది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 01, 2024 | 4:51 PM

చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఇండస్ట్రీ భారీ వేడుక కోసం ఏర్పాట్లు చేస్తుందని దిల్ రాజు స్వయంగా చెప్పారు. అయితే ఈ వేదికను ఇండస్ట్రీ శ్రేయస్సుకు ఉపయోగపడేలా మలుచుకోవాలని పెద్దలు భావిస్తున్నారా..? చిరు వేడుకలో స్వామికార్యం స్వకార్యం రెండూ పూర్తి చేయబోతున్నారా..? అసలెప్పుడు ఉండబోతుంది చిరంజీవి పద్మ విభూషణ్ ఈవెంట్..?

మూడు నాలుగు రోజులుగా చిరంజీవి ఇల్లు పర్యాటక కేంద్రంగా మారిపోయింది. వచ్చే వాళ్లు వస్తున్నారు.. వెళ్లేవాళ్లు వెళ్తున్నారు.. పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఇండస్ట్రీ చిరుకు వచ్చిన పురస్కారాన్ని భారీ ఎత్తున సెలబ్రేట్ చేయబోతున్నారు.

చిరంజీవి సత్కార సభ కోసం ఏర్పాటు చేస్తున్న ఈ వేడుకలోనే ఇండస్ట్రీ ప్రయోజనాల గురించి కూడా చర్చ జరగబోతుంది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడే ఇండస్ట్రీ శ్రేయస్సుకు ఉపయోగపడే పలు కీలక అంశాలు సిఎం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

మరోవైపు సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ నాయకులకు మధ్య చిరంజీవి ఎప్పుడూ వారధిగానే ఉన్నారు. కరోనా సమయం కానీ.. దాని తర్వాత వచ్చిన టికెట్ల ఇష్యూ కానీ.. విషయం ఏదైనా చిరునే ముందున్నారు.

ఇకిప్పుడు తన పద్మ విభూషణ్ వేడుకను కూడా ఇండస్ట్రీ శ్రేయస్సుకు ఉపయోగపడేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు మెగాస్టార్.





























