- Telugu News Photo Gallery Cinema photos Meenakshi chaudhary coming with two movies to this makar sankranti 2025
Meenakshi Chaudhary: వారి రూట్లోనే వెళ్తున్న మీనాక్షి చౌదరి.. ఈ సంక్రాంతికి సందడి చేయనున్న ముద్దగుమ్మ
శ్రుతి, అనుపమ, తమన్నా, రష్మిక... వీరి రూట్లో ఇప్పుడు మీనాక్షి చౌదరి. ఇదీ వరుస.. సేమ్ సీజన్‌లోనో, సేమ్ డేట్‌లోనో, ఒకరోజూ, ఒక వారం ముందూ వెనుకలుగానో, మళ్లీ మళ్లీ ప్రేక్షకులను పలకరిస్తుంటే ఆ థ్రిల్ యమాగా ఉంటుంది. ఆ యమా ఫీలింగ్ ఎలా ఉంటుందో మాకు తెలుసంటున్నారు.. ఈ హీరోయిన్లందరూ! అసలే పండగ సీజన్... ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తే ఆ మజా కేక అంటున్నారు శ్రుతి హాసన్.
Updated on: Sep 24, 2024 | 12:18 PM

శ్రుతి, అనుపమ, తమన్నా, రష్మిక... వీరి రూట్లో ఇప్పుడు మీనాక్షి చౌదరి. ఇదీ వరుస.. సేమ్ సీజన్‌లోనో, సేమ్ డేట్‌లోనో, ఒకరోజూ, ఒక వారం ముందూ వెనుకలుగానో, మళ్లీ మళ్లీ ప్రేక్షకులను పలకరిస్తుంటే ఆ థ్రిల్ యమాగా ఉంటుంది. ఆ యమా ఫీలింగ్ ఎలా ఉంటుందో మాకు తెలుసంటున్నారు.. ఈ హీరోయిన్లందరూ!

అసలే పండగ సీజన్... ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తే ఆ మజా కేక అంటున్నారు శ్రుతి హాసన్. సంక్రాంతి సీజన్‌లో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో ప్రేక్షకులను పలకరించిన క్రెడిట్ ఉంది శ్రుతి హాసన్‌కి. సినిమాల హిట్లూ ఫ్లాపుల సంగతి పక్కన పెడితే ఈ ఫిబ్రవరిలో ఈగిల్, సైరెన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు అనుపమ. ఆ నెక్స్ట్ మంత్ వచ్చిన టిల్లు స్క్వేర్ ఆమె కెరీర్‌లో బ్లాక్ బస్టర్ సినిమాగా క్రెడిట్ అయింది.

మొన్నటికి మొన్న నార్త్ లో తమన్నా కూడా డబుల్ దమాకా చూశారు. స్త్రీ2, వేద రెండు సినిమాలతోనూ మెప్పించారు మిల్కీ బ్యూటీ. ఈ రెండు సినిమాల తర్వాత నార్త్ లో తమన్నా క్రేజ్ అమాంతం పెరిగిందనడంలో ఏమాత్రం డౌట్స్ అక్కర్లేదు.

ఇయర్ ఎండింగ్‌లో నేనిచ్చే పార్టీకి మీరంతా రెడీయేనా అంటూ కొంటెగా కన్నుగీటుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. డిసెంబర్ 6న ఆమెను సూసేకీ రెండు టిక్కెట్లు తీసుకోవాలి ప్రేక్షకులు. పుష్ప2లో శ్రీవల్లిగా, చావాలో మహారాణీగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ.

ప్రతి రెండు నెలలకీ ఓ సారి ఏదో ఓ సినిమాతో పలకరిస్తూనే ఉన్నారు మీనాక్షి. లక్కీ భాస్కర్‌లో చిన్న బాబుకి తల్లిగా నటించారు మీనాక్షి. కెరీర్ పీక్స్ మీదున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని సలహాలు అందుతున్నాయట ఆమెకి.




