- Telugu News Photo Gallery Cinema photos Fight between Meenakshi Chaudhary Bhagyashri Borse Neha Shetty for top place in tier 2
టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోరు.. టాప్ ప్లేస్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందిగా !!
ఎంతసేపు టాప్ హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు.. మేం కూడా ఉన్నాం.. మమ్మల్ని గుర్తించండి.. మా గురించి కూడా చెప్పంటి అంటున్నారు మీడియం రేంజ్ హీరోయిన్లు. టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు.. టైమ్ వస్తే టాప్ గేర్ వెళ్లడానికి అరడజన్ మంది బ్యూటీస్ పోటీ పడుతున్నారు. మరి వాళ్లెవరు..?
Updated on: Sep 24, 2024 | 12:05 PM

ఈ ఏడాది సేమ్ సీన్ మీనాక్షి చౌదరి విషయంలో రిపీట్ అయింది. వీరిద్దరి కెరీర్లను పోల్చి చూస్తూ కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు వెల్ విషర్స్ .

హీరోల్లో మీడియం రేంజ్ ఎలాగైతే ఉంటారో.. హీరోయిన్లలోనూ మీడియం రేంజ్ ఉంటారు. ఈ లిస్టులో అందరికంటే ముందు దూసుకుపోతున్నారు మీనాక్షి చౌదరి. వరస సినిమాలతో టాప్ రేస్‌లోకి వచ్చారు మీనాక్షి. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు.. వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్, విశ్వంభర సినిమాల్లో నటిస్తున్నారు.

మీడియం రేంజ్‌లో భాగ్యశ్రీ బోర్సే కూడా రేసులోనే ఉన్నారు. మిస్టర్ బచ్చన్‌తో పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌తో నటిస్తున్నారు.

నభా నటేష్ సైతం నిఖిల్‌తో స్వయంభు సినిమాల్లో నటిస్తూ టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్నారు. సాయి మంజ్రేకర్ కూడా నిఖిల్‌తో ది ఇండియా హౌజ్ సినిమాలో నటిస్తున్నారు.

డిజే టిల్లు ఫేమ్ నేహా శెట్టికి కూడా వరస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించారు. కెరీర్‌ను డిసైడ్ చేసే హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు నేహా శెట్టి. తెలుగమ్మాయిలు రితూ వర్మ, వైష్ణవి చైతన్య సైతం మీడియం రేంజ్‌లో టాప్ ప్లేస్ రేసులోనే ఉన్నారు.




