- Telugu News Photo Gallery Cinema photos Makers are ready to give big movie updates on the occasion of Ugadi
Ugadi Movies: ఈ సారి ఉగాది శాన్నాళ్లు యాదుండిపోవాలా.. పండగ కబురులేంటి.?
ఈ సారి ఉగాది మునపట్లా ఉండదు.. శానా ఏండ్లు గుర్తుంటది అంటున్నారు మన దర్శక నిర్మాతలు. దానికి తగ్గట్లుగానే ప్లానింగ్స్ జరుగుతున్నాయి. క్రేజీ కాంబినేషన్స్‌కు అనౌన్స్‌మెంట్ సిద్ధమవుతుంది.. అలాగే కొన్ని భారీ సినిమాలకు ముహూర్తాలు పెడుతున్నారు. మరి ఈసారి ఉగాదికి సందడి చేయబోయే ఆ పండగ లాంటి కబుర్లేంటో చూద్దాం..
Updated on: Apr 06, 2024 | 11:02 AM

అప్‌డేట్స్ ఇవ్వడానికి అకేషన్ కోసమే వేచి చూస్తుంటారు దర్శక నిర్మాతలు.. అది వచ్చిందంటే చాలు పండగ చేసుకుంటారు. ఉగాదికి కూడా ఇదే జరగబోతుంది. ఎప్రిల్ 9న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భారీగానే గుడ్ న్యూస్‌లు చెప్పబోతున్నారు.

అందులో మొదటిది అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమా అనౌన్స్‌మెంట్. కుదిర్తే ఎప్రిల్ 9నే దీని ముహూర్తం పెట్టనున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీ, అనిల్ కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతుంది. భగవంత్ కేసరి తర్వాత మరోసారి సీనియర్ హీరోతోనే సినిమా చేయబోతున్నారు అనిల్.

ఇక పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ యాక్షన్ చిత్రం ఓజి సినిమా స్పెషల్ టీజర్ కూడా ఈ ఉగాదికే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అప్‌డేట్ ఈ వారంలోనే రానుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచి చూస్తున్న అభిమానులకు.. ఉగాది సమాధానం అయ్యేలా ఉంది. ఆ రోజే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది రోజే రాబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఈ ఎప్రిల్ 9కి టాలీవుడ్‌లో అప్‌డేట్స్ పండగ రానుంది.




