- Telugu News Photo Gallery Cinema photos Tollywood Senior Heroines Select the Heroine Oriented Movies in recent times Telugu Actress Photos
Heroine Oriented: సీనియర్ హీరోయిన్స్ అందరూ ఒకే పట్టాలెక్కారు ఏంటి.? అన్ని ఆ సినిమాలేనా.?
హీరోయిన్స్ అంటే గ్లామర్ షో మాత్రమే చేయాలా.. పాటలకు వచ్చి అలా వెళ్లిపోవాలా..? ఏం ఓ సినిమాను మా భుజాలపై మోయలేమా..? మోసి చూపిస్తాం అంటూ శపథాలు చేస్తున్నారు మన హీరోయిన్లు. హీరోలతో ఆఫర్స్ రాని ముద్దుగుమ్మలంతా హాయిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటున్నారు. మరి వాళ్లెవరు..? ఏం చేస్తున్నారు.? సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్లా అవకాశాలు రావట్లేదు.
Updated on: Apr 05, 2024 | 9:25 PM

హీరోయిన్స్ అంటే గ్లామర్ షో మాత్రమే చేయాలా.. పాటలకు వచ్చి అలా వెళ్లిపోవాలా..? ఏం ఓ సినిమాను మా భుజాలపై మోయలేమా..? మోసి చూపిస్తాం అంటూ శపథాలు చేస్తున్నారు మన హీరోయిన్లు.

హీరోలతో ఆఫర్స్ రాని ముద్దుగుమ్మలంతా హాయిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటున్నారు. మరి వాళ్లెవరు..? ఏం చేస్తున్నారు.? సీనియర్ హీరోయిన్లకు ఒకప్పట్లా అవకాశాలు రావట్లేదు.

నయనతార అండ్ తాప్సీ.. సేమ్ స్కూల్‌లో చదువుకున్నట్టు, ఒకటే సిలబస్‌ని గుర్తుచేసుకుంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరూ మాట్లాడుతున్నది అకాడమిక్స్ గురించి అనుకునేరు... కానే కాదండోయ్.. ఇక్కడ ఈ భామలిద్దరూ చెబుతున్నది ఫ్యామిలీ పాఠాలు. అందులో ప్రయారిటీస్ అనే టాపిక్!

అందుకే వరసగా అలాంటి సినిమాలే చేస్తున్నారు మన హీరోయిన్లు. తాజాగా తమన్నా ఓదెల 2తో పాటు మరో రెండు మూడు ఫీమేల్ సెంట్రికల్ సినిమాలు చేస్తున్నారు.

భోళా శంకర్ తర్వాత తెలుగులో సినిమాలేవీ ఒప్పుకోని తమన్నా.. సంపత్ నంది కథ అందిస్తున్న ఓదెల 2లో భాగమయ్యారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్‌లలో నటించారు తమన్నా.

ఇక అనుష్క గురించి చెప్పేదేముంది..? క్రిష్‌తో ఘాతితో పాటు మలయాళంలోనూ కథనార్ సినిమా చేస్తున్నారు స్వీటీ. రష్మిక మందన్న సైతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం గాళ్ ఫ్రెండ్, రెయిన్ బో అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు.

త్రిష, నయనతారతో పాటు నేషనల్ క్రష్ రష్మిక పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఫిజికల్ అప్పియరెన్స్ కి రష్మిక చక్కగా సరిపోతారనే మాటలు జోరందుకున్నాయి.




