- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu to NTR Devara latest movie updates from Tollywood industry
Film News: మహేష్ గురించి కృష్ణవంశీ మాటల్లో.? అదరగొట్టనున్న జాన్వీ – తారక్!
తరాలు మారినా వినిపించే పాటల్లో తొలి వరుసలో ఉంటుంది... 'అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి' అనే పాట. మహేష్‌బాబు హీరోగా నటించిన మురారి సినిమాలోని పాట అది. వద్దురా, సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ గతంలో తెలుగులో పాపులర్ అయిన పాటను పదే పదే పాడుకుంటున్నారు ఆండ్రియా జర్మియా. తిరుపతికి వెళ్లి లడ్డూ ప్రసాదం తీసుకోని వాళ్లూ, తారక్ సినిమాకు వచ్చి డ్యాన్సులు చూడాలనుకోనివారూ ఉంటారా చెప్పండి?
Updated on: Mar 02, 2024 | 1:19 PM

తరాలు మారినా వినిపించే పాటల్లో తొలి వరుసలో ఉంటుంది... 'అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి' అనే పాట. మహేష్‌బాబు హీరోగా నటించిన మురారి సినిమాలోని పాట అది. కృష్ణవంశీ టేకింగ్ గురించి మాట్లాడుకోవాల్సిన ప్రతిసారీ తప్పక గుర్తుచేసుకుంటారు మురారినీ, ఈ పాటనీ. అంతేనా... కృష్ణవంశీ దర్శకత్వంలో తమ హీరో ఇంకో సినిమా చేస్తే చూడాలని ఉందని చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

ఇదే విషయాన్ని సోషల్‌మీడియాలో ఓపెన్‌గా అడిగారు కృష్ణవంశీని. అందుకు క్రియేటివ్ డైరక్టర్ స్పందించిన తీరు మహేష్ ఫ్యాన్స్ ఖుషీని డబుల్ చేస్తోంది. మహేష్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అని అన్నారు కృష్ణవంశీ. తమ కాంబినేషన్‌లో సినిమా కష్టమనే విషయాన్ని ఓపెన్‌గా ఒప్పుకున్నారు కెప్టెన్.

వద్దురా, సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ గతంలో తెలుగులో పాపులర్ అయిన పాటను పదే పదే పాడుకుంటున్నారు ఆండ్రియా జర్మియా. తనలో తాను హమ్ చేసుకోవడం కాదు, ఓపెన్‌గా అందరి ముందు కూడా పాడుతున్నారు. స్వతహాగా సింగర్ ఆండ్రియా. మంచి నటిగా కూడా పేరు తెచ్చుకున్నారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేదు అని స్టేట్‌మెంట్ ఇచ్చేటంత బిజీగా లేకపోయినా, అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య తెలుగులో వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటించారు ఆండ్రియా. తనకి పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. ఒకానొకప్పుడు పెళ్లి గురించిన ఆలోచనలు వచ్చేవట. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి థాట్స్ రావడం లేదని చెబుతున్నారు ఆండ్రియా.

తిరుపతికి వెళ్లి లడ్డూ ప్రసాదం తీసుకోని వాళ్లూ, తారక్ సినిమాకు వచ్చి డ్యాన్సులు చూడాలనుకోనివారూ ఉంటారా చెప్పండి? యస్.. నాటు కొట్టుడు పాటల కోసం సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనుకునే అభిమానులు చాలా మందే ఉంటారు. అలాంటి వారందరికీ దేవర పండగలా ఉంటుందని అంటున్నారు కొరటాల. దేవరలో తారక్, జాన్వీ మధ్య మూడు పాటలు ప్లాన్ చేశారట కెప్టెన్.

ఈ మూడు పాటలతో పాటు తారక్ మీద స్పెషల్‌గా ఇంకో సాంగ్ చిత్రీకరించాల్సి ఉంటుంది. తారక్‌తో డ్యాన్సుల కోసం ఎన్నాళ్లుగానో వెయిటింగ్ అని ఇప్పటికే చాలా సార్లు చెప్పేశారు జాన్వీ కపూర్. ప్రస్తుతం హైదరాబాద్‌లో 15 రోజుల షెడ్యూల్ జరుగుతోంది. దాదాపు 35 రోజుల బ్రేక్ తర్వాత ఈ షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేశారు తారక్. రిలీజ్ అక్టోబర్‌లో కాబట్టి, అప్పటిలోగా అన్నీ వర్కులూ కంప్లీట్ చేసుకోవచ్చని ధీమాగా ఉంది టీమ్.




