త్వరలో మహేష్ బాబు హీరోగా ఓ ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించబోతున్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలో రెండు ఇంగ్లీష్ నావెల్స్‌కు సంబంధించిన హక్కులు జక్కన్న తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంగ్లీష్ రైటర్ విల్బర్ స్మిత్ రాసిన ట్రింఫ్ ఆఫ్ ది సన్, కింగ్ ఆఫ్ కింగ్స్ నవలల హక్కులు జక్కన్న తీసుకున్నారన్నది ముంబై మీడియాలో వినిపిస్తున్న మాట.