- Telugu News Photo Gallery Cinema photos Mahesh babu movie journey from his first movie rajakumarudu to present movie
Mahesh Babu: రాజకుమారుడు టు రాజమౌళి… మహేష్ సినీ జర్నీ
రాజకుమారుడు టు రాజమౌళి... ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ రైమింగ్ నేమ్సే. టాలీవుడ్‌లో ప్రిన్స్ గా సక్సెస్ చూసి, ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న మహేష్ జర్నీ గురించి ఇష్టంగా చెప్పుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. మహేష్ హీరోగా నటించిన రాజకుమారుడు సినిమా పాతికేళ్లు పూర్తి చేసుకుంది. రాఘవేంద్రరావు డైరక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఆ సినిమాలో ప్రిన్స్ ట్యాగ్‌తో పరిచయమైన మహేష్...
Updated on: Aug 02, 2024 | 1:08 PM

ఇంతకీ మహేష్ ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? ఫ్యాన్స్ ఏమని క్వశ్చన్ చేస్తున్నారు.? గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా, ఇంకా నెక్ట్స్ మూవీ పట్టాలెక్కించలేదు సూపర్ స్టార్ మహేష్.

ఆఫ్రికన్ నేపథ్యంలో సాగే కథ ఇదని విజయేంద్రప్రసాద్ ఇప్పటికే చెప్పారు. SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు అల్యూమీనియం ఫ్యాక్టరీలో సెట్ రెడీ అవుతుండగానే.. ఫారెన్ నుంచి టెక్నీషియన్స్ VFX వర్క్ షురూ చేసారు. వీలైనంత త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

డ్రీమ్ కాంబో రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబీ 29 ఎనౌన్స్ చేసిన సూపర్ స్టార్ ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.

సినిమా అప్‌డేట్ లేకపోయినా.. మహేష్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళుతూ కెమెరాలకు చిక్కారు సూపర్ స్టార్.

రాజమౌళి తో కలిసి అంతర్జాతీయ స్థాయి సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఆ సుముహూర్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది ఘట్టమనేని సైన్యం.




