అప్పటి కోపాన్ని ఇప్పుడు నైజామ్ ఎగ్జిబిటర్లు తీర్చుకోవాలనుకుంటున్నారు. రిలీజ్‌కి రెడీ అవుతున్న పూరి సినిమా డబుల్ ఇస్మార్ట్ మీద సీతకన్నేశారు. థియేటర్లను సర్దుబాటు చేసి, డబుల్ ఇస్మార్ట్ కి దారి ఇవ్వడానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. లైన్లో ఉన్న మిస్టర్ బచ్చన్, తంగలాన్ కి థియేటర్లు కేటాయించడానికే మొగ్గుచూపుతున్నారు. తాము నష్టపోయినప్పుడు పట్టించుకోని వ్యక్తి కోసం ఇప్పుడు తామెందుకు ముందుకు రావాలన్న మాట వినిపిస్తోంది.