- Telugu News Photo Gallery Cinema photos Lady power star Sai Pallavi New photos goes viral in social media on august 2024 Telugu Heroines Photos
Sai Pallavi: హీరోయిన్స్ లో కల్లా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వింటేజ్ వేరు.. ఫొటోస్ వైరల్.
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే చెప్పాలి. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో సినీరంగ ప్రవేశం చేసి మలర్ పాత్రలో ఒదిగిపోయింది. తొలి సినిమాతోనే అటు మలయాళీ సినీ ప్రియులను.. ఇటు తెలుగు, తమిళ్ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
Updated on: Aug 10, 2024 | 12:32 PM

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే చెప్పాలి. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో సినీరంగ ప్రవేశం చేసి మలర్ పాత్రలో ఒదిగిపోయింది.

తొలి సినిమాతోనే అటు మలయాళీ సినీ ప్రియులను.. ఇటు తెలుగు, తమిళ్ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

అందం, అభినయంతో టాలీవుడ్ కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఫిదా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తామంటూ నిర్మాతలు ఆఫర్స్ ఇచ్చారు.

అయినా కంటెంట్ నచ్చి.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తానని తేల్చీ చెప్పింది. దీంతో ప్రేక్షకులలో ఆమె స్థానం మరింత అగ్రస్థానానికి తీసుకెళ్లాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది సాయి పల్లవి.

మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఇప్పుడు ఆమె తండేల్ చిత్రంలో నటిస్తుంది.

డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి, చైతూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.




