Actress : తెలుగులో తగ్గిన అవకాశాలు.. కోలీవుడ్లో వరుస ఆఫర్స్.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
తెలుగు తెరపై మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి ఫస్ట్ మూవీతోనే ఓ ఊపు ఊపేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. ఈ హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. తొలి చిత్రం హిట్టైనా ఇప్పుడు అవకాశాల కోసమే ఎదురుచూస్తుంది. కానీ తమిళంలో మాత్రం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Updated on: Aug 23, 2025 | 1:21 PM

ఫస్ట్ మూవీతోనే తెలుగులో సంచలన విజయం సాధించింది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అదృష్టం కలిసిరాలేదు.

కృతిశెట్టి... తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. కుర్రకారు మనసులలో మరో హీరోయిన్ లేకుండా చెరిపేసింది. ఒక్క సినిమాతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది.

ఉప్పెన సినిమా తర్వాత తెలుగులో ఆమె ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ చిన్నది.. నెమ్మదిగా వరుస డిజాస్టర్స్ అందుకుంది.

ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. కానీ తమిళంలో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తుంది. కార్తీ, రవిమోహన్, ప్రదీప్ రంగనాథ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది కృతి శెట్టి.

ఈ సినిమాలు భారీ బడ్జెట్ తో కూడినవే. ప్రదీప్ రంగనాథ్ జోడిగా చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా వచ్చే నెల 18న రిలీజ్ కానుంది. అలాగే కార్తీ, రవి మోహన్ సరసన నటిస్తున్న సినిమాలపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.




