- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Acted 3 Movies Only One Hit, She Is Kalyani Priyadarshan
Actress: చేసింది మూడు సినిమాలు.. ఒకే ఒక్క హిట్టు.. ఆరేళ్లుగా తగ్గని క్రేజ్..
ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో బిగ్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేసి.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. గత ఆరేళ్లుగా ఒక్క హిట్టు అందుకోకుండానే విపరీతమైన క్రేజ్ కంటిన్యూ చేస్తున్న ఈ వయ్యారి గురించి తెలుసా.. ?
Updated on: Aug 23, 2025 | 9:57 AM

తెలుగులో ఆమె నటించింది కేవలం మూడు సినిమాల్లోనే. అందులో రెండు డిజాస్టర్స్ కాగా.. ఒకే ఒక్క హిట్టు అందుకుంది. కానీ ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఇంతకీ ఈ అమ్మడిని గుర్తుపట్టారా.. ?

తనే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఎక్కువగా మలయాళంలోనే నటిస్తుంది. తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంతో ఆకట్టుకుంది కళ్యాణి. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం సినిమాలతో ఆకట్టుకుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే నటించేందుకు రెడీగా ఉంది ఈ బ్యూటీ. తెలుగులో కళ్యాణి సినిమా చేసి ఆరేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేదు.

సినీరంగంలోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.




