- Telugu News Photo Gallery Cinema photos Kollywood heroes who gave call sheets to Tollywood production houses
Movie Updates: మన ప్రొడక్షన్ హౌస్‌లకు తమిళ తంబిల కాల్షీట్.. వారు ఎవరంటే.?
మన స్టార్లు పొరుగు నిర్మాణ సంస్థల్లో నటించడం ఎంత ప్రెస్టీజియస్‌గా ఉంటుందో, పొరుగు హీరోలు మన ప్రొడక్షన్ హౌస్‌లకు కాల్షీట్ ఇవ్వడం కూడా అంతే గ్రేట్‌గా అనిపిస్తుంటుంది. రీసెంట్ టైమ్స్ లో కోలీవుడ్ హీరోలు మన మేకర్స్ తో మింగిల్ అవుతున్నారు. ఇప్పుడు సెట్స్ మీద కూడా అలాంటి సినిమాలు. టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.
Updated on: May 21, 2024 | 4:01 PM

దిల్‌రాజు సంస్థలో దళపతి విజయ్ హీరోగా వారసుడు సినిమా తెరకెక్కినప్పుడు మెగా కొలాబరేషన్ అంటే ఇది కదా అని హ్యాపీగా ఫీలయింది సౌత్ ఇండస్ట్రీ. ఆ సినిమా మంచి హిట్ కావడంతో వెంటనే ధనుష్ సర్ మీద కూడా హోప్స్ పెరిగాయి. అంచనాలను అందుకుని బంపర్ హిట్ అయ్యారు మాస్టారు ధనుష్.

సర్ మూవీ ఇచ్చిన బూస్టప్‌తో ఇప్పుడు మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నారు ధనుష్. శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో కుబేరలో యాక్ట్ చేస్తున్నారు ధనుష్. ఈ మూవీలో రష్మిక నాయికగా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున కీ రోల్ చేస్తున్నారు. ఓ వైపు సొంత డైరక్షన్‌లో రాయన్‌తో బిజీగా ఉంటూనే కుబేర షూటింగ్ పూర్తి చేస్తున్నారు ధనుష్.

ప్రస్తుతం మైత్రీ మూవీస్‌లో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ మొదలైంది. తమిళంలో విడాముయర్చి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, అనుకున్న టైమ్‌కి గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్‌ని స్టార్ట్ చేసేశారు తల. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్.

అటు సూర్య చేస్తున్న కంగువ మూవీ నిర్మాణంలో యువీ క్రియేషన్స్ భాగస్వామ్యం ఉంది. నడిప్పిన్ నాయగన్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన గెటప్పుల్లో ఆకట్టుకుంటున్నారు సూర్య. ఇందులో బాబీ డియోల్ నటిస్తున్నారు. ప్రతి ఫ్రేమూ నెక్స్ట్ రేంజ్‌లో ఉందంటూ ఆల్రెడీ పొగుడుతున్నారు సూర్య సతీమణి, స్టార్ నటి జ్యోతిక.




