- Telugu News Photo Gallery Cinema photos Know Tamannaah Remuneration For Special Song, Check Here Details
Actress: తస్సాదియ్యా.. మాములు రేంజ్ కాదయ్యో.. 3 నిమిషాల పాటకు రూ.5 కోట్లు.. ఈ హీరోయిన్ ఎవరంటే..
ఇప్పుడు భారతీయ సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో చాలా మంది తారలు స్పెషల్ పాటలతో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ బ్యూటీ గురించి మీకు తెలుసా.. ? కేవలం 3 నిమిషాల పాటకు రూ.5 కోట్లు వసూలు చేస్తుంది.
Updated on: Jul 23, 2025 | 9:53 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. కానీ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. హిందీలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. అలాగే స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ తమన్నా. ఇప్పుడు సినిమాలు కాదు.. స్పెషల్ పాటలతో నెట్టింటిని హీటెక్కిస్తుంది. దీంతో తమన్నా స్పెషల్ అప్పీరియన్స్ కోసం స్టార్ హీరోస్, దర్శకనిర్మాతలు సైతం వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా అంటూ రఫ్పాడించింది.

తమన్నా చేసిన జైలర్, స్త్రీ 2 సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. దీంతోపాటు ఇటీవల హిందీలో రైడ్ 2 చిత్రంలో ఆమె చేసిన నషా సాంగ్ సైతం భారీగా హిట్టయ్యింది. ఆజ్ కి రాత్ తరహాలో రూపొందించిన ఈ పాటలో తనదైన స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది.

నషా పాటలో తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ పాటకు తమన్నా తీసుకున్న రెమ్యునరేషన్ సైతం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కేవలం 3 నిమిషాల పాటకు దాదాపు రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుందని టాక్.

ప్రస్తుతం తమన్నా సినిమాల్లో కాకుండా స్పెషల్ పాటలతోనే ఎక్కువగా బిజీగా ఉంటుంది. తెలుగు, హిందీ భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాటలతో సందడి చేస్తుంది. ఇక ఇప్పుడు తమన్నా దారిలోకి హీరోయిన్ పూజా హెగ్డే సైతం వచ్చినట్లు తెలుస్తోంది.




