- Telugu News Photo Gallery Cinema photos Know Akkineni Naga Chaitanya film journey from love stories to action movies
Naga Chaitanya: అక్కినేని వారసుడి 16 ఏళ్ల సినీప్రయాణం.. ప్రేమకథల నుంచి యాక్షన్ సినిమాల వరకు..
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. హీరోగా సినీ ప్రయాణం మొదలుపెట్టి 16 ఏళ్లు అవుతుంది. విమర్శలు, ప్రశంసలు తీసుకుంటూ నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు చైతూ. అందమైన ప్రేమకథ చిత్రాల నుంచి మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. 2009 నుంచి ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాలతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు.
Updated on: Sep 05, 2025 | 1:43 PM

2009లో అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించారు చైతూ. ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 2010లో ఏమాయ చేసావే మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు.

కేవలం హీరోజం చిత్రాలు కాకుండా విభిన్న కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించారు. ప్రయోగాత్మక చిత్రాలతో అడియన్స్ ఇష్టపడే హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఏ మాయ చేసావే, ప్రేమమ్, తడాఖా, సూర్య, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి, దడ వంటి చిత్రాలతో నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.

లవ్ స్టోరీ వంటి ప్రేమకథ చిత్రాలతో అమ్మాయిల హృదయాలను దొచుకున్నాడు. కేవలం లవ్ స్టోరీస్ కాదు.. యాక్షన్ చిత్రాలను సైతం సునాయసంగా చేయగలనని తండేల్ చిత్రంతో నిరూపించారు. చైతూ కెరీర్ లో లవ్ స్టోరీ, మజిలీ, తండేల్ చిత్రాలు కీలకమలుపుగా నిలిచాయి.

కంఫర్ట్ జోన్ చిత్రాలు కాకుండా నిత్యం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మరోస్థాయికి చేరారు. సినిమాలు మాత్రమే కాకుండా ధూత వెబ్ సిరీస్ ద్వారా అటు ఓటీటీ ప్రపంచంలోనూ తనదైన ముద్రవేశారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డిఫరెంట్ స్టోరీతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో చైతూ.

తెలుగు చిత్రపరిశ్రమలో 16 వసంతాలు పూర్తి చేసుకున్నారు నాగచైతన్య. దీంతో తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు అభిమానులు. అలాగే తండేల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం NC24 ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.




