- Telugu News Photo Gallery Cinema photos Know Not Samantha, Nayanthara, This Actress Delivered 100 Crore Movie, Her Name Is Kalyani Priyadarshan
Tollywood: వరుసగా అట్టర్ ప్లాప్స్.. కట్ చేస్తే.. నయనతార, సమంత రికార్డ్స్ బ్రేక్ చేసిన హీరోయిన్..
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు మారుమోగుతుంది. ఇప్పటివరకు వరుసగా అట్టర్ ప్లాప్స్ తో సతమతమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఒక్క మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆమె నటించిన సినిమా బాక్సాఫఈస్ వద్ద రూ.100 కోట్లతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ..
Updated on: Sep 05, 2025 | 2:00 PM

ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించింది ఓ హీరోయిన్. ఇన్నాళ్లు వరుస సినిమాలతో సతమతమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఆమె నటించిన సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.

దుల్కర్ సల్మాన్ నిర్మించిన లోకా చాప్టర్ 1: చంద్ర మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆమె దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. మనాడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు లోకా చిత్రంతో హిట్టు కొట్టింది.

ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు, నజ్లాన్, శాండీ, సంధు సలీం కుమార్, అరుణ్ కురియన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి మంచి స్పందనను అందుకుంటోంది. 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 101 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

ఈ చిత్రానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా ద్వారా భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరోయిన్ అంటూ అభిమానులు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

కళ్యాణి 1993 ఏప్రిల్ 5న చెన్నైలోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. కళ్యాణి చెన్నైలోని లేడీ ఆండాల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. హృతిక్ రోషన్ చిత్రం క్రిష్ 3 తో కళ్యాణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2017లో 'హలో' చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టింది.




