AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: సౌత్ అంతా తనదే అంటున్న ఆ కన్నడ కస్తూరి

ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు కానీ ఇక్కడే సెటిల్ అయిపోయేవాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అందులో తాను కూడా ఉన్నానంటున్నారు ఓ కన్నడ బ్యూటీ. ఈ మధ్య ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది.. పైగా రాబోయే 8 నెలల్లో ఆమె నుంచి 4 ప్యాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 9:18 PM

Share
రుక్మిణి వసంత్.. నిన్నటి వరకు కేవలం కన్నడలో మాత్రమే ఎక్కువగా వినిపించిన పేరు. ఇప్పటికే అక్కడ సప్త సాగరాలు దాటి, బఘీరా లాంటి సినిమాలతో స్టార్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తమిళ, తెలుగుపై కూడా ఫోకస్ చేసారు.

1 / 5
సెప్టెంబర్ 5న ఈమె నటించిన మదరాశి విడుదల కానుంది. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించారు. రాబోయే 8 నెలల్లో రుక్మిణి నుంచి 4 ప్యాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి.

2 / 5
అందులో మదరాశి ఈ వారంలోనే రానుంది. ఇక అక్టోబర్ 2న కాంతార ఛాప్టర్ 1తో రాబోతున్నారు రుక్మిణి. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయనేది చెప్పాల్సిన పనిలేదు.

3 / 5
కాంతార 2లో కనకవతి పాత్రలో నటిస్తున్నారు ఈ బ్యూటీ.2026 ఫస్టాఫ్‌లోనూ రుక్మిణి హవానే కనిపించబోతుంది. మార్చి 19న యశ్ టాక్సిక్.. జూన్ 25న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌తో రానున్నారు.

4 / 5
వీటితో పాటు విక్రమ్ తనయుడు ధృవ్ నెక్ట్స్ సినిమాలో రుక్మిణి పేరు వినిపిస్తుంది. మొత్తానికి మరో మీనాక్షి చౌదరి, శ్రీలీలలా కాకుండా.. ఈమె అయినా వచ్చిన క్రేజ్‌ను సరిగ్గా వాడుకుంటారా లేదా చూడాలి.

5 / 5