- Telugu News Photo Gallery Cinema photos Kannappa actress preity mukhundhan beautiful photos goes viral on internet
క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన కన్నప్ప బ్యూటీ.. అంత ముద్దుగా ఉందో చూడండి.
ప్రీతి ముకుందన్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు హీరోయిన్ మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా.. ఈ చిన్నది ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలోనటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె 2000 జూలై 30న తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించింది ఈ చిన్నది. చిన్న వయస్సు నుసిన్చే భరతనాట్యంలో శిక్షణ పొందిన ఆమె, హిప్ హాప్, సినీ జానపదం, పాశ్చాత్య, సమకాలీన, ఫ్యూజన్ వంటి డాన్స్ ల్లో ప్రావీణ్యం సంపాదించింది.
Updated on: Apr 21, 2025 | 1:51 PM

ప్రీతి ముకుందన్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈ అమ్మడు హీరోయిన్ మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా.. ఈ చిన్నది ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలోనటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఆమె 2000 జూలై 30న తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించింది ఈ చిన్నది. చిన్న వయస్సు నుసిన్చే భరతనాట్యంలో శిక్షణ పొందిన ఆమె, హిప్ హాప్, సినీ జానపదం, పాశ్చాత్య, సమకాలీన, ఫ్యూజన్ వంటి డాన్స్ ల్లో ప్రావీణ్యం సంపాదించింది.

కాలేజీ రోజుల్లో మోడలింగ్‌తో పాటు టీవీ వాణిజ్య ప్రకటనలలో కనిపించి, దక్షిణ భారత యాడ్-ఫిల్మ్ పరిశ్రమలో గుర్తింపు పొందింది. ప్రీతి తన నటనా జీవితాన్ని టీవీ షోలలో డాన్స్ షోల ద్వారా ప్రారంభించింది. 2022లో "ముత్తు ము2" అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వీక్షణలతో పాపులర్ అయింది.

2024లో తెలుగు చిత్రం "ఓం భీమ్ బుష్"తో సినీ రంగంలోకి అడుగుపెట్టి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే ఏడాడి తమిళ చిత్రం "స్టార్"లో కూడా కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం "కన్నప్ప" సినిమాలో నటిస్తుంది. ఈ పాన్-ఇండియా చిత్రంలో మంచు విష్ణు సరసన కథానాయికగా నటిస్తోంది. ఇందులో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు.

2025 ఏప్రిల్‌లో విడుదలైన "మేనే ప్యార్ కియా" అనే రొమాంటిక్ కామెడీ త్రిల్లర్‌లో హృదు హారూణ్‌తో కలిసి నటించింది, ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది.




