ఆనంది ఓ అందాల నిధి..నీ చూపుతో చంపకే అందరినీ..
బ్యూటీ, అందాల తార ఆనంది చీర కట్టులో అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రీదేవీ సోడా సెంటర్ తో మంచి ఫేమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాలో చీరలో అందంగా ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 21, 2025 | 1:30 PM

అందాల ముద్దుగుమ్మ ఆనంది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. డిసెంబర్ 10న ఈ అమ్మడు వరంగల్ జిల్లాలో జన్మించింది. డ్యాన్స్ మీద ఉన్న ఇష్టంతో ఆట జూనియర్స్ లో తన డ్యాన్స్ తో అందరినీ అలరించింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత నటిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ బ్యూటీ 2012లో వచ్చిన బస్టాఫ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. తర్వాత ఈ రోజుల్లో, ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాలు చేసి, తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. అక్కడగ కూడా ఈ బ్యూటీ అందానికి, నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు.

రీసెంట్ గా శివంగి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనా విశ్వరూపం చూపిందనే చెప్పాలి. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అంతగా ఆకట్టుకుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ చీరలో తన అందాలతో కుర్రకారును మాయ చేసింది. సింపుల్ చీరలో, గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



