- Telugu News Photo Gallery Cinema photos Heart attack movie actress adah sharma latest stunning photos
అందాలతో గత్తర లేపిన బ్యూటీ.. అదా శర్మ ఫోటోలు చూస్తా ఫిదా అవ్వాల్సిందే
టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ అదా శర్మ. అదా శర్మ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తుంది. 1992 మే 11న ముంబైలో జన్మించింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2008లో హిందీ హారర్ సినిమా 1920తో నటనలోకి అడుగుపెట్టింది, ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.
Updated on: Apr 21, 2025 | 1:55 PM

టాలీవుడ్ లో హీరోయిన్ గా చేసి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ అదా శర్మ. అదా శర్మ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తుంది. 1992 మే 11న ముంబైలో జన్మించింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

2008లో హిందీ హారర్ సినిమా 1920తో నటనలోకి అడుగుపెట్టింది, ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. అదా శర్మ నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ నామినేషన్ వచ్చింది. తెలుగులో హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), క్షణం (2016) వంటి సినిమాలతో విజయాలు సాధించింది.

హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు అంతగా సక్సెస్ కాలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది.

2023లో ది కేరళ స్టోరీ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది, ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ఈ సినిమా పై పలు వివాదాలు కూడా జరిగాయి. ఇక ఇప్పుడు హిందీలో ఎక్కువగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం సినిమాలు , వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ అలరిస్తుంది ఈ చిన్నది. అలాగే సోషల్ మీడియాలోనూ తన అందాలతో కవ్విస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.




