- Telugu News Photo Gallery Cinema photos Kangana Ranuat alleges some people are saying actors to not to work in her movies
Tollywood News: నా మీద కుట్ర చేశారు అంటున్న కంగనా | ఆలస్యంగా రానున్న స్పిరిట్
బాలీవుడ్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, ఎంపీ కంగనా రనౌత్. పరిశ్రమలో చాలా మంది తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని, తన సినిమాల్లో నటించొద్దని నటీనటులకు ఫోన్ చేసి మరీ చెప్పారన్నారు. కంగన స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Updated on: Aug 27, 2024 | 6:54 PM

మధ్యప్రదేశ్ హై కోర్టు కూడా వాళ్ళ మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డ్‌కు సూచించింది. అక్కడ్నుంచే ఎమర్జెన్సీ సెన్సార్ కష్టాలు డబుల్ అయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ని తాము ఆదేశించలేమని బాంబే హై కోర్టు తీర్పునిచ్చింది.

ముఖ్యంగా డార్లింగ్ కోసం మూడు డిఫరెంట్ లుక్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఆ లుక్స్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు డైరెక్టర్.

Pa. Ranjith: ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల విషయంలో తనకు అన్యాయం జరిగిందన్నారు దర్శకుడు పా రంజిత్. సారప్పట్ట పరంపర సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయని, కానీ రాజకీయాల కారణంగా జాతీయ అవార్డుల్లో ఆ సినిమాకు స్థానం దక్కలేదన్నారు.

Sarangapani Jathakam: కామెడీ స్టార్ ప్రియదర్శి హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటికే జెంటిల్‌మెన్, సమ్మోహనం లాంటి సినిమాలు వచ్చాయి. ఇదే కాంబోలో తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు.

Sai Pallavi: పాత్రల ఎంపిక విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవన్నారు నటి సాయి పల్లవి. ఏ సినిమా విజయం సాధిస్తుందో ముందే చెప్పలేం, అందుకే మనసుకు నచ్చిన సినిమా చేసుకుంటూ పోతున్నా అన్నారు. అవకాశం వస్తే పూర్తి స్థాయి కామెడీ, యాక్షన్ సినిమాలు చేయాలనుందన్నారు ఈ బ్యూటీ.




