- Telugu News Photo Gallery Cinema photos Suriya Kanguva and Rajinikanth Vettiyan to clash at boxoffice on October 10th
అక్టోబర్ 10న ఒకరినొకరు ఢీ కొట్టుకోటానికి రెడీ అయిన తమిళ్ సూపర్ స్టార్స్
అక్టోబర్ 10న ఏం జరగబోతోంది? అంతా అనుకున్నట్టే జరుగుతుందా? ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు నిజంగానే ఢీ కొట్టడానికి సిద్ధమవుతారా? లేకుంటే ఎవరైనా ఒకరు డ్రాప్ అవుతారా? ఒకవేళ ముందూ వెనుకలుగా వస్తారా? రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి సినిమా సర్కిల్స్ లో. ఇప్పుడు ఈ డిస్కషన్ తమిళనాడు సరిహద్దులు దాటేసింది... దానికి రీజన్ అవి రెండూ ప్యాన్ ఇండియా చిత్రాలు కావడమే!
Updated on: Aug 27, 2024 | 6:51 PM

తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా దేవర పార్ట్ ఒన్. ఈ సినిమా అక్టోబర్ 10న బరిలోకి దిగుతుందని గతంలో ప్రకటించారు. అయితే దేవర ప్రీపోన్ కావడంతో ఈ డేట్ మీద ఫుల్‌గా కాన్‌సెన్‌ట్రేట్ చేశారు తమిళ స్టార్స్... దేవర పోస్ట్ పోన్ అనే మాట వినగానే నేనొచ్చేస్తున్నా అని ప్రకటించారు సూర్య.

ఫస్ట్ నుంచీ మోటార్ రేసింగ్ అంటే తల అజిత్‌కి ప్రాణం. తన ప్యాషన్ కోసం సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలనుకుంటున్నారట అజిత్. ఇప్పుడు చేతిలో ఉన్న రెండు చిత్రాల తర్వాత అజిత్ ఇంకే సినిమాలూ చేయరా..?

కంగువ కంటెంట్ తెలిస్తే ఆ డేట్ కి రావడానికి ఇంకెవరూ సాహసించరని జ్ఞానవేల్ రాజా గతంలో అన్నారు. అంటే కంగువ కంటెంట్ తెలియక వేట్టయాన్ బరిలోకి దిగారా? లేకుంటే కంగువ రిలీజ్ డేట్‌లో ఏమైనా మార్పులుంటాయా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కంగువను ఒకరోజు ముందే అంటే, అక్టోబర్ 9నే రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా? అనే టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది.

జైలర్ సక్సెస్ ఊపుమీదున్నారు రజనీకాంత్. ఆయన నటించిన వేట్టయాన్‌లో నార్త్ నుంచి అమితాబ్, సౌత్ నుంచి రానా కీ రోల్స్ చేశారు. ఇంతమందితో చేసిన సినిమా కాబట్టి కంటెంట్ పరంగానూ స్ట్రాంగ్‌గా ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన అసలు అక్టోబర్ 10న ఏం జరుగుతుంది? సూపర్‌స్టార్, సూర్య... ఇద్దరూ కలెక్షన్లను పంచుకుంటారా? లేకుంటే సర్దుకుపోతారా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.