సాధారణంగా 600 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన పాన్ ఇండియన్ సినిమా వస్తుందంటే.. ప్రమోషన్ దద్దరిల్లిపోవాలి. ట్రిపుల్ ఆర్, బాహుబలి సమయంలో రాజమౌళి తన టీంను దేశమంతా తిరిగారు. కానీ కల్కి విషయంలో అవన్నీ జరిగేలా కనిపించట్లేదు. మేకింగ్ వీడియోలు, ఒకట్రెండు ఇంటర్వ్యూలతోనే కల్కి ప్రమోషన్ కానిచ్చేస్తున్నారు నాగ్ అశ్విన్.