- Telugu News Photo Gallery Cinema photos Jr. NTR Takes a Break from Telugu Film for Week Long "War 2" Song Shoot
Jr NTR: ఆ సినిమాకు సడన్ బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఏకంగా అన్ని రోజులా
డ్రాగన్ సినిమా షూట్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్, సడన్‌గా ఆ సినిమాను పక్కన పెట్టి మరో మూవీ సెట్‌లో అడుగుపెట్టారు. ఒకటి రెండు రోజులు కాదు వారం రోజులు పాటు మరో షూట్‌లో పాల్గొనబోతున్నారు..? ఇంతకీ ఎన్టీఆర్ ఏ సినిమా బ్రేక్ తీసుకున్నారు... అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. వార్ 2 సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది.
Updated on: Jul 09, 2025 | 7:13 PM

వార్ 2 సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తారక్, హృతిక్ ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ కావటంతో వాళ్లీద్దరు డ్యాన్స్ చేస్తుంటే చూడాలని ఫ్యాన్స్ కూడా గట్టిగా కోరుకున్నారు.

అందుకే అభిమానుల ఆశలు నిజం చేస్తూ అదిరిపోయే సాంగ్‌ను ప్లాన్ చేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ సాంగ్‌ను గతంలోనే షూట్ చేసేందుకు ప్లాన్ చేసినా.. హృతిక్ గాయపడటంతో ఆలస్యమైంది.

ఇప్పుడు హీరోలిద్దరూ రెడీ అనటంతో సోమవారం సాంగ్ షూట్ స్టార్ట్ చేసింది అయాన్ టీమ్. ముంబైలో వేసిన భారీ సెట్‌లో వారం రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించబోతున్నారు.

ఈ డ్యాన్స్ వార్‌ను తెర మీద చూడాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే. వార్ 1లో హృతిక్, టైగర్ కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ పాటను తెరకెక్కించారు. ఆ సాంగ్ సినిమా సక్సెస్‌లోనూ కీ రోల్ ప్లే చేసింది.

ఇప్పుడు అలాంటి పాటనే వార్ 2 కోసం కూడా రెడీ చేస్తున్నారు. కానీ ఈ సారి స్కేల్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్.




