- Telugu News Photo Gallery Cinema photos Actress And Singer Andrea Jeremiah Celebrates Her Pet Dog Birthday, See Photos
Tollywood:పెట్ డాగ్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
గతంలో ఒకరిద్దరి ఇళ్లల్లో మాత్రమే కనిపించిన పెట్ డాగ్స్ ఇప్పుడు అందరి ఇళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. చాలా మంది వీటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ తన పెట్ డాగ్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.
Updated on: Jul 06, 2025 | 5:19 PM

ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో పెట్ డాగ్ లు కనిపిస్తున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక చాలా మంది తమ పెట్ డాగ్స్ ను కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు . అంతేకాదు వాటికి ఘనంగా పుట్టిన రోజులు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు.

తాజాగా కోలీవుడ్ క్రేజీ హీరోయిన్, సింగర్, ఆండ్రియా జెర్మియా తన పెంపుడుకుక్క జాన్ స్నో 5వ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ బర్త్ డే వేడుకకు మరికొన్ని కుక్క పిల్లలను గెస్టులుగా పిలిచింది ఆండ్రియా.

అనంతరం తన పెట్ డాగ్ బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆండ్రియా. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా హీరోయిన్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. ఈమె నటించిన పలు సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి

గతేడాది విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది ఆండ్రియా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.



















