ఎన్టీఆర్ వెకేషన్ అయిపోయింది.. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వారం రోజుల పాటు ఫారెన్ వెళ్లొచ్చారు తారక్. హాలీడేస్ అయిపోయాయి.. మరి దేవర నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు..? ఎన్టీఆర్ మళ్లీ సెట్స్‌లో జాయిన్ అయ్యేదెప్పుడు..? వార్ 2 కోసం ఇప్పటికే నెల రోజులకు పైగా దేవరకు బ్రేక్ ఇచ్చారు తారక్. మరి కొరటాల సినిమాతో చేతులు కలిపేదెప్పుడు..? మూడు నాలుగు రోజులుగా దేవర ఫస్ట్ సింగిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.