- Telugu News Photo Gallery Cinema photos Heroine Krithi Shetty Next movie update and her new glamorous photos in social media may 2024 Telugu Actress Photos
Krithi Shetty: ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది నాకు.! అన్నట్టే చేస్తున్న కృతి శెట్టి..
ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది నాకు అంటూ ఓ డైలాగ్ ఉంటుంది కదా..! కృతి శెట్టికి ఇప్పుడిది బాగా సూటవుతుంది. కొన్నాళ్లుగా హిట్స్‌కి దూరంగా ఉన్న బేబమ్మ.. జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయిందా..? ఆఫర్స్ క్యూ కడుతున్నాయా..? గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసొస్తుందా లేదా..? టైటిల్‌కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి.
Updated on: May 27, 2024 | 8:22 AM

ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది నాకు అంటూ ఓ డైలాగ్ ఉంటుంది కదా..! కృతి శెట్టికి ఇప్పుడిది బాగా సూటవుతుంది. కొన్నాళ్లుగా హిట్స్‌కి దూరంగా ఉన్న బేబమ్మ.. జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయిందా..? ఆఫర్స్ క్యూ కడుతున్నాయా..?

గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసొస్తుందా లేదా..? టైటిల్‌కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునేలోపే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది.

కానీ అంతలోనే టైమ్ టర్న్ అయింది.. వరసగా ఫ్లాపులొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.

ఈమె చేతిలో ప్రస్తుతం శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య మనమే సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. తెలుగులో ఈమెకు ఆఫర్స్ రాకపోయినా.. తమిళ, మలయాళంలో మాత్రం అమ్మడి జోరు బాగానే ఉంది.

ముఖ్యంగా మలయాళంలో అజయంతే రాండాం మోషనం సినిమాలో నటిస్తున్నారు. దీని బడ్జెట్ దాదాపు 90 కోట్లు. ఇక తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు కృతి.

సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు కృతి శెట్టి. సినిమాల్లో గ్లామర్ షోకు దూరంగానే ఉన్నా.. బయట మాత్రం సెగలు పుట్టిస్తున్నారు బేబమ్మ. అదే ఈమెకు హెల్ప్ అవుతుంది కూడా.

మొన్నీమధ్యే పోస్ట్ చేసిన బెల్లీ డాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. టాలీవుడ్‌లో పునర్వైభవం రావాలంటే మాత్రం.. మనమే సినిమా హిట్ అవ్వాల్సిందే.




