- Telugu News Photo Gallery Cinema photos Jayam Ravi's Iraivan movie is ready release and announced new movies
Jayam Ravi: పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో జోష్ లో జయం రవి.. ఓ చిత్రం విడుదలకు.. కొత్త చిత్రాలు ప్రకటన..
పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జయం రవి స్పీడు పెంచారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరడజను సినిమాలు లైన్‌లో పెట్టి ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాల్లొ ఒక్కొక్కటి ఒక్కో జానర్ కావటం మరో విశేషం. జయం రవి హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఇరైవన్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో పాటు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సైరన్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నారు ఈ కోలీవుడ్ స్టార్.
Updated on: Sep 21, 2023 | 12:17 PM

పొన్నియిన్ సెల్వన్ సక్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జయం రవి స్పీడు పెంచారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరడజను సినిమాలు లైన్‌లో పెట్టి ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాల్లొ ఒక్కొక్కటి ఒక్కో జానర్ కావటం మరో విశేషం.

జయం రవి హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఇరైవన్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో పాటు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సైరన్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నారు ఈ కోలీవుడ్ స్టార్.

తాజాగా తనీ ఒరువన్‌కు సీక్వెల్‌ను కన్ఫార్మ్ చేశారు. మరోసారి అన్న మోహన్ రాజా దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ టీజర్‌కు కూడా కోలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు మరో నాలుగైదు సినిమాలు ఈ కోలీవుడ్ హీరో ఖాతాలో ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న బ్రదర్, ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న జీనీ సినిమాలకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ కూడా చాలా రోజుల కిందటే వచ్చేసింది.

తాజాగా జయం రవి లిస్ట్‌లోకి మరో రెండు సినిమాలు యాడ్ అయ్యాయి. 33వ సినిమాలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జయం రవి, ఆ తరువాత జనగణమన పేరుతో ఓ స్పై థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఈ సినిమలన్నీ మరో మూడేళ్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంటే ఈ మూడు సంవత్సరాల్లో అన్ని జానర్లు కవర్ చేసేలా ప్లాన్ రెడీ చేశారు జయం రవి.




