- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Krishnan Marriage news viral in social media Telugu Actress Photos
Trisha Krishnan: మరోసారి వైరల్‌గా త్రిష పెళ్లి వార్తలు.. ఇప్పటికి స్పందించని త్రిష..!
అలాంటిదేం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా.. త్రిష పెళ్లి గురించి పుకార్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. మరోసారి అలాంటి వార్తలే కోలీవుడ్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ సారైనా ఈ వార్తలు నిజమౌతాయా..? సరైనోడు దొరికితే పెళ్లి చేసుకుంటా..? లేదా.. సింగిల్‌గానే ఉండిపోతా..? నా పర్సనల్ విషయాలతో మీకేంటి పని అంటూ చాలా సార్లు ఫైర్ అయ్యారు త్రిష. చాలా రోజులుగా అమ్మడి పెళ్లి విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Updated on: Sep 21, 2023 | 10:15 AM

అలాంటిదేం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా... త్రిష పెళ్లి గురించి పుకార్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. మరోసారి అలాంటి వార్తలే కోలీవుడ్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ సారైనా ఈ వార్తలు నిజమౌతాయా..?

సరైనోడు దొరికితే పెళ్లి చేసుకుంటా..? లేదా.. సింగిల్‌గానే ఉండిపోతా...? నా పర్సనల్ విషయాలతో మీకేంటి పని అంటూ చాలా సార్లు ఫైర్ అయ్యారు త్రిష. చాలా రోజులుగా అమ్మడి పెళ్లి విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా లాక్ డౌన్ టైంలో శింబుతో క్లోజ్ అవ్వటంతో వీరిద్దరికి త్వరలోనే పెళ్లి అన్న వార్త కోలీవుడ్ మీడియాలో తెగ హడావిడి చేసింది. కానీ తరువాత అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది.సౌత్‌లో సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్‌లో త్రిష కూడా ఒకరు.

ఇక కెరీర్ ముగిసిపోయిందనుకున్న ప్రతీ సారి సక్సెస్‌తో ట్రాక్‌లోకి వచ్చిన త్రిష... పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం తడబడ్డారు. ఓ బిజినెస్ మ్యాన్‌తో పీటల దాకా వెళ్లిన పెళ్లికి నో చెప్పేసి సింగిల్‌గా ఉండిపోయారు.

ఆ టైంలో కెరీర్‌లో గ్యాప్ వచ్చినా.. తరువాత పుల్ స్వింగ్ చూపిస్తున్నారు.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో రాణి కుందవై పాత్రలో నటించిన త్రిష.. ఆ క్యారెక్టర్‌తో మరోసారి సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు.

దీంతో మరోసారి ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ మీద కూడా ఫోకస్ పెరిగింది. తాజాగా ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కోలీవుడ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇంత వరకు త్రిష టీమ్ మాత్రం స్పందించలేదు.




