- Telugu News Photo Gallery Cinema photos New songs creating buzz around films new trend in Tollywood Telugu Entertainment Photos
Trending Songs: రిలీజ్ కు ముందే సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్న తెలుగు ట్రేండింగ్ సాంగ్స్..
కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న సినిమా డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలవుతోంది. ఈ సినిమాలోని మాయచేసి అనే పాటను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమా నుంచి దేఖో ముంబై అనే పాటను విడుదల చేశారు మాస్ మహారాజ్ రవితేజ.
Updated on: Sep 20, 2023 | 10:03 PM

కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న సినిమా డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలవుతోంది. ఈ సినిమాలోని మాయచేసి అనే పాటను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమా నుంచి దేఖో ముంబై అనే పాటను విడుదల చేశారు మాస్ మహారాజ్ రవితేజ. ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా, యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా రూల్స్ రంజన్ ఉంటుందని అన్నారు కిరణ్ అబ్బవరం.

సీనియర్ నటి జయలలిత సమర్పిస్తున్న సినిమా రుద్రంకోట. రాము కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 22న విడుదల కానుందీ సినిమా. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంటే ఇష్టమని, ఆయన సినిమాల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించానని అన్నారు డైరక్టర్ రాము కోన.

ప్యాండమిక్ తర్వాత ఓటీటీల్లో నెగటివ్ కంటెంట్‌కి ఆదరణ పెరిగిందని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఆ ట్రెండ్‌ని పట్టుకుని రాక్షస కావ్యం సినిమా చేశారని అన్నారు. ఇప్పటి ఆడియన్స్ కి కావాల్సిన పర్ఫెక్ట్ సినిమా రాక్షస కావ్యం అని ప్రశంసించారు దిల్‌రాజు.

కన్నడలో ఘన విజయం సాధించిన సప్త సాగర దాచే ఎల్లో సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సినిమా ఇది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. సెప్టెంబర్ 22న విడుదల కానుంది సప్తసాగరాలు దాటి.




