- Telugu News Photo Gallery Cinema photos Is Aamir Khan In For LCU, Director Lokesh Kanagaraj In Talks With Bollywood Perfectionist
Lokesh Kanagaraj: LCU లోకి బాలీవుడ్ బడా హీరో.. ఇది పెద్ద స్కెచే
బాలీవుడ్‌ని ఇప్పుడు తమిళ డైరక్టర్లు ఏలేస్తున్నారు. ఒకరు, ఇద్దరు కాదు.. బాలీవుడ్ టాప్ హీరోలందరూ కోలీవుడ్ కెప్టెన్ల కథలకు ఫిదా అయిపోతున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్టులోకి ఆమీర్‌ఖాన్ కూడా చేరారని టాక్. ఓ ఫక్తు యాక్షన్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. నన్ను బాలీవుడ్‌లో సక్సెస్ అవ్వనివ్వండి... మన వాళ్లని 100 మందిని బాలీవుడ్‌కి తీసుకెళ్తానని చెప్పారు అట్లీ.
Updated on: Aug 23, 2024 | 9:08 PM

బాలీవుడ్‌ని ఇప్పుడు తమిళ డైరక్టర్లు ఏలేస్తున్నారు. ఒకరు, ఇద్దరు కాదు.. బాలీవుడ్ టాప్ హీరోలందరూ కోలీవుడ్ కెప్టెన్ల కథలకు ఫిదా అయిపోతున్నారు. లేటెస్ట్ గా ఈ లిస్టులోకి ఆమీర్‌ఖాన్ కూడా చేరారని టాక్. ఓ ఫక్తు యాక్షన్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

నన్ను బాలీవుడ్‌లో సక్సెస్ అవ్వనివ్వండి... మన వాళ్లని 100 మందిని బాలీవుడ్‌కి తీసుకెళ్తానని చెప్పారు అట్లీ. చెప్పినట్టే చేసి చూపించారు. పేరుకి బాలీవుడ్ హీరో షారుఖ్ అయినా, జవాన్‌కి పనిచేసిన వాళ్లల్లో ఎక్కువగా సౌత్ ఇండియన్సే ఉన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న బేబీ జాన్ సినిమా ద్వారా కీర్తీసురేష్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారు.

సల్మాన్‌ఖాన్‌తో సినిమా చేసే పనుల్లో ఉన్నారు డైరక్టర్ విష్ణువర్ధన్. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన షేర్‌షా ను డైరక్ట్ చేశారు విష్ణు. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆయనతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారట సల్మాన్.

ప్రస్తుతం మురుగదాస్‌తో మూవీ చేస్తున్నారు సల్మాన్‌ఖాన్. రష్మిక మందన్న ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న మురుగదాస్.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు.

లేటెస్ట్ గా వీరి కోవలోకే చేరారు లోకేష్ కనగరాజ్. ఆమీర్‌ఖాన్‌తో ఓ ప్యాన్ ఇండియా యాక్షన్ మూవీని చేయడానికి సిద్ధమవుతున్నారు లోకేష్. ప్రస్తుతం తలైవర్‌తో కూలీ సినిమా చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. ఇది పూర్తవగానే మిస్టర్ పర్ఫెక్ట్ తో మూవీ మొదలుపెడతారన్నమాట.




