Rajeev Rayala |
Updated on: Aug 31, 2024 | 2:37 PM
బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఇనాయ సుల్తానా ఒకరు. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.
బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో పాటు అందంతో కవ్వించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది
ఈ అమ్మడు అంతకు ముందు యాంకర్ గా కొన్ని ఇంటర్వ్యూలు చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాతో కంటే .. సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
తన అందాలతో అభిమానులను పడేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవలే బీచ్ లో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది ఇనాయ.
తాజాగా ఇనాయ సుల్తానా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బీచ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోల పై కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.