- Telugu News Photo Gallery Cinema photos If you look at the ruckus going on in the movie Razakar, it seems like a repeat of the Kerala story and the Kashmir files scene
Razakar Movie: రజకార్ సినిమా చుట్టూ కాంట్రవర్సీ వలయం.. కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ సీన్ రిపీట్ అవనుందా..
కాంట్రవర్సీ కథలకు డిమాండ్ పెరిగిందని తెలుసు.. అందుకే దర్శక నిర్మాతలంతా అటు వైపు పరుగులు పెడుతున్నారా..? చరిత్రలో దాగున్న నిజాల్ని నిర్భయంగా బయటికి తీసుకొస్తున్నారా..? విషయం ఎంత వివాదంగా ఉంటే.. విజయం కూడా అంతే బలంగా ఉంటుందని నమ్ముతున్నారా..? తాజాగా రజాకార్ సినిమా ఇదే మాయ కంటిన్యూ చేస్తుందా..? వివాదాస్పద కథలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగిపోయింది. 20 కోట్ల లోపు బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు కూడా 200 నుంచి 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి.
Updated on: Oct 13, 2023 | 3:32 PM

కాంట్రవర్సీ కథలకు డిమాండ్ పెరిగిందని తెలుసు.. అందుకే దర్శక నిర్మాతలంతా అటు వైపు పరుగులు పెడుతున్నారా..? చరిత్రలో దాగున్న నిజాల్ని నిర్భయంగా బయటికి తీసుకొస్తున్నారా..? విషయం ఎంత వివాదంగా ఉంటే.. విజయం కూడా అంతే బలంగా ఉంటుందని నమ్ముతున్నారా..? తాజాగా రజాకార్ సినిమా ఇదే మాయ కంటిన్యూ చేస్తుందా..?

వివాదాస్పద కథలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగిపోయింది. 20 కోట్ల లోపు బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు కూడా 200 నుంచి 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అయితే ఇందులో విజయంతో పాటు వివాదం కూడా ఉంటుంది. అది తెలిసే అడుగులేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఇలా వచ్చి.. సంచలనం సృష్టించనవే.

కాశ్మీర్ ఫైల్స్ విడుదలైనపుడు.. అసలు అలాంటి సినిమా ఒకటి వచ్చిందనే విషయమే ఆడియన్స్‌కు ఐడియా లేదు. కశ్మీర్ పండిట్స్‌పై జరిగిన అకృత్యాలే ఈ సినిమా కథాంశంగా తీసుకొచ్చారు వివేక్ అగ్నిహోత్రి.

అలాగే కేరళ స్టోరీ కూడా అంతే. చిన్న సినిమాగా వచ్చి 250 కోట్లు వసూలు చేసింది. తాజాగా నిజాం పాలకుల సమయం నాటి రజాకార్ సినిమా వస్తుందిప్పుడు.

రజకార్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే వివాదం మొదలైంది.. టీజర్ వచ్చాక ఇంకాస్త ముదిరింది.. ఇప్పుడు పాట విడుదలయ్యాక మరో స్థాయికి వెళ్లిపోయింది. గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు యాట సత్యనారాయణ దర్శకుడు. ఈ సినిమాపై జరుగుతున్న రచ్చ చూస్తుంటే.. కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ సీన్ రిపీట్ అయ్యేలాగే కనిపిస్తుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?




