- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun Pushpa 2 Movie Teaser Review in Telugu Telugu Heroes Photos
Allu Arjun – Pushpa 2: పుష్పరాజ్ పూనకాలు లోడింగ్.! బన్నీకి మరో అవార్డు గ్యారంటీనా.!
మొదటిసారి ఏదైనా జరిగినప్పుడు మజా వస్తుంది. అదే మళ్లీ మళ్లీ కంటిన్యూ అయితే కిక్ వస్తుంది. ఇప్పుడు అలాంటి కిక్‌ని టేస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ నిజంగానే మాస్ జాతరను మొదలుపెట్టేసింది. ఇంతకీ టీజర్‌ని మీరు చూశారా.? ఇంకోసారి చూస్తామంటారా.? వారెవా.! సూపర్ కదా.. అని అంటారా.? టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచీ అందరి నోటా ఇదే మాట.
Updated on: Apr 09, 2024 | 7:07 PM

ఆగస్టు 15 కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన పుష్ప ప్యాన్ ఇండియా రేంజ్‌లో తడాఖా చూపించింది.

వెయ్యికోట్లకు పైగా ఏవైనా టార్గెట్లుంటే చెప్పండి.. కొట్టి చూపిద్దాం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది టీమ్‌లో. అదీ విషయం.. మాస్ జాతరంటే ఎలా ఉండాలో ఎగ్జాంపుల్ చెప్పినట్టుంది పుష్ప 2టీజర్‌ని చూస్తుంటే. అందుకే నార్త్ నుంచి దండిగా లెక్కతో దిగేశారు డిస్ట్రిబ్యూటర్లు.

ఇప్పుడు ఎవరైనా పుష్పరాజ్ దగ్గర వెయ్యికోట్ల టాపిక్ తెస్తే.. 'ఏయ్.. గమ్మునుండవాయ్.. అదేందో పెద్ద కొండను మోసే పనైనట్టు మాట్లాడుతున్నావే.. తేలికైన సంగతే కదా.. ఇదిగో... ఇట్టా చేసేయొచ్చు.. ' అని తనదైన రాయలసీమ శ్లాంగ్‌లో గట్టిగానే చెప్పేసేటట్టున్నారు..

పుష్ప2 నార్త్ థియేట్రికల్ రైట్స్ ఎంత పలికాయో తెలిస్తే... అసలు తగ్గేదేలే అని ఇప్పుడే సెలబ్రేషన్స్ షురూ చేస్తారు ఫ్యాన్స్. వేర్ ఈజ్ పుష్పా అంటూ వెతికి మరీ పార్టీ అడిగేస్తారు. నార్త్ లో పుష్ప2 థియేట్రికల్ రైట్స్ 200 కోట్లకు అమ్ముడయ్యాయన్నది టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న న్యూస్.

అని ధీమా వ్యక్తం చేస్తున్నారు యూనిట్ మెంబర్స్. ఇంత బిజినెస్ చేసి, ఇంత మందిలో క్యూరియాసిటీ పెంచేశాక... బరిలోకి దిగితే ఏ రేంజ్‌లో ఉండాలో సుకుమార్‌కి బాగా తెలుసు... అందుకే ఇంచు... ఇంచుని.. చూసీ చూసీ రూపొందిస్తున్నారు కెప్టెన్.

ఓటీటీ ఎంతకు విక్రయించారో తెలుసా? 275 కోట్లట. అంటే, టోటల్.. పాతిక తక్కువ 500 కోట్లకు రీచ్ అయినట్టేగా... ఏ బిడ్డా ఇది నా అడ్డా అని చెప్పుకోవడానికి ఇంతకు మించిన తరుణం ఇంకేం ఉంటుంది? ఎలాగూ ఓవర్సీస్ బిజినెస్, తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్, అదర్ స్టేట్స్ రైట్స్, ఫస్ట్ డే కలెక్షన్లు... ఇవన్నీ కలుపుకుంటే వెయ్యి కోట్లు రావడం ఎంత సేపు చెప్పండి.

గంగమ్మ జాతరకు ఉన్న ఇంపార్టెన్స్ నీ, సినిమా గ్రాండియర్‌నీ చెప్పకనే చెప్పేసింది టీజర్. ఫాహద్ ఫాజిల్‌తో పుష్పరాజ్ తలపడే తీరు ఎలా ఉంటుందో చూడటానికి, ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.




