అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్నారు సూర్య. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ లుక్‌లో కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. కమల్ హాసన్ కూడా లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విక్రమ్ సినిమాలో స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన యూనివర్సల్ స్టార్, నెక్ట్స్ ఇండియన్ 2 కోసం ఏజ్ ఓల్డ్ గెటప్‌లోకి మారిపోతున్నారు.