- Telugu News Photo Gallery Cinema photos Heroins deepika padukone kajal kareena kapoor are creating a new trend in baby bump photo shoots
బేబీ బంప్ ఫోటో షూట్స్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ముద్దుగుమ్మలు
ప్రెగ్నెన్సీ గురించి పెద్దగా ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉండే రోజులు కొండెక్కాయి. సీమంతాల సీజన్ పాతబడిపోయిందనుకున్నారేమో, బేబీ బంప్‌లతో ఫొటో షూట్‌లు చేసే సెలబ్రిటీల సంఖ్య మాత్రం బాగా పెరిగిందిప్పుడు... లేటెస్ట్ ట్రెండ్‌లో మరో అడుగు ముందుకేశారు కాబోయే అమ్మ దీపిక పదుకోన్... ప్రజెంట్ గ్లామర్ ఫీల్డ్‌లో నయా ట్రెండ్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్. అందాల భామలు అమ్మతనం ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
Updated on: Sep 05, 2024 | 8:22 PM

ప్రెగ్నెన్సీ గురించి పెద్దగా ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉండే రోజులు కొండెక్కాయి. సీమంతాల సీజన్ పాతబడిపోయిందనుకున్నారేమో, బేబీ బంప్‌లతో ఫొటో షూట్‌లు చేసే సెలబ్రిటీల సంఖ్య మాత్రం బాగా పెరిగిందిప్పుడు... లేటెస్ట్ ట్రెండ్‌లో మరో అడుగు ముందుకేశారు కాబోయే అమ్మ దీపిక పదుకోన్...

ప్రజెంట్ గ్లామర్ ఫీల్డ్‌లో నయా ట్రెండ్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్. అందాల భామలు అమ్మతనం ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. బేబీబంప్‌తో చేసిన ఫోటో షూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గ్లామరస్ మదర్స్ అనిపించుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఈ ట్రెండ్‌లో మరో అడుగు ముందుకేశారు దీపిక అండ్ రణ్‌వీర్ కపుల్.

అసలు ఈ ట్రెండ్‌ని సీరియస్‌గా స్టార్ట్ చేసిన క్రెడిట్ మా కరీనాదే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. తన ప్రెగ్నెన్సీ ఎక్స్‌పీరియన్స్‌ను ఫోటోస్ వీడియోస్ రూపంలో షేర్ చేయటమే కాదు.. ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో బుక్ కూడా రిలీజ్ చేశారు కరీనా.

ఆ మధ్య కాజల్ అగర్వాల్ కూడా ప్రెగ్నెన్సీ అప్‌డేట్స్‌ను ఫాలోవర్స్‌తో రెగ్యులర్‌గా షేర్ చేసుకున్నారు. ఆ టైమ్‌లో ఫిజికల్‌గా మెంటల్‌గా తను ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్‌ను, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అభిమానులతో పంచుకున్నారు కాజల్ అగర్వాల్.

తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఎనౌన్స్ చేయటం దగ్గర నుంచి క్రియేటివ్‌గా ప్లాన్ చేస్తున్నారు బాపుగారి బొమ్మ ప్రణీత. ఫస్ట్ బేబీకే కాదు, ఇప్పుడు సెకండ్ టైమ్ కూడా ట్రెండీ ఫొటో షూట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో సోనమ్ కూడా ఇలాగే చేశారు. నియర్ ఫ్యూచర్‌లో ఇంకెంత మంది ఫొటో షూట్లతో సర్‌ప్రైజ్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ అంటున్నారు అభిమానులు.




