- Telugu News Photo Gallery Cinema photos Heroines doing both Tollywood and Bollywood movies like Kiara, Rashmika, Rakul Preet, Deepika Padukone Telugu Actress Photos
Tollywood – Bollywood: టాలీవుడ్ మాదే, బాలీవుడ్ మాదే అంటున్న హీరోయిన్లు.! ఎవరంటే.?
నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా ఈడా ఉంటా అని అల్లు అర్జున్ చెప్పిన మాటనే ఫాలో అవుతున్నారు హీరోయిన్లు. అదెలా అనుకుంటున్నారా..? ఇదిగో ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అనే కోడ్ కూడా అర్థమైపోతుంది. అయినా ఈ రోజుల్లో హీరోయిన్లు తక్కువేం కాదు.. అన్నిచోట్లా మేమే ఉంటామంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ వైపు చూడాలంటే.. నిర్మాతల ఆస్తులు కరిగిపోయేవి.
Updated on: Feb 12, 2024 | 2:50 PM

నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా ఈడా ఉంటా అని అల్లు అర్జున్ చెప్పిన మాటనే ఫాలో అవుతున్నారు హీరోయిన్లు. అదెలా అనుకుంటున్నారా..? ఇదిగో ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అనే కోడ్ కూడా అర్థమైపోతుంది.

అయినా ఈ రోజుల్లో హీరోయిన్లు తక్కువేం కాదు.. అన్నిచోట్లా మేమే ఉంటామంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ వైపు చూడాలంటే.. నిర్మాతల ఆస్తులు కరిగిపోయేవి. వాళ్ల కండీషన్స్ ప్రొడ్యూసర్స్‌కు కాంతారాలో హీరో అరుపుల్లా భయంకరంగా వినబడేవి.

కానీ ఇప్పుడు కాస్త బెటర్. ఎలాగూ టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్‌పై బాగానే ఉంది కాబట్టి తెలుగులో నటించడమే బెటర్ అని ఫిక్సైపోయారు ముద్దుగుమ్మలు. అలాగని బాంబేను వదలట్లేదు.. బోనస్‌గా హైదరాబాద్‌లోనూ జెండా పాతేస్తున్నారు.

కావాలంటే కియారా అద్వానీనే తీసుకోండి.. బాలీవుడ్‌లో ఈమె స్టార్ హీరోయిన్. వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అక్కడ బానే ఉందిగా.. ఇంక టాలీవుడ్ ఎందుకు అనుకుంటున్నారా..? లేదే.. ఇక్కడా బిజీ అవ్వాలని చూస్తున్నారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో కియారానే హీరోయిన్. ఇక ఇన్నాళ్లూ హిందీలోనే ఉన్న శ్రీదేవి కూతురు.. దేవరతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. కెరీర్ కొత్తలో నేనొక్కడినే, దోచేయ్ సినిమాలు చేసిన కృతి సనన్.. గతేడాది ఆదిపురుష్‌తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు.

దీపిక పదుకొనే సైతం తెలుగు, హిందీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దీపిక.. రెమ్యునరేషన్ బాగుంటే ఇక్కడే మరిన్ని సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇక పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన్న సైతం తెలుగు, హిందీ ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేస్తున్నారు.




