- Telugu News Photo Gallery Cinema photos South music directors who are determined to plant a flag in Bollywood
Music Directors: హీరోలకు మాత్రమేనా.. మాకు కూడా ఆ రేంజ్ కావాలంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు..
ఇంట ఎవరైనా గెలుస్తాడు.. కానీ రచ్చ గెలిచినపుడే కదా అసలు మజా వచ్చేది.. అందుకే మన హీరోలు కూడా పాన్ ఇండియా కోసం పాకులాడుతున్నారు. హీరోలకేనా పాన్ ఇండియా.. మాకు అక్కర్లేదా.. మాకేం తక్కువ అంటూ వచ్చేస్తున్నారిప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు. దేవీ, థమన్‌తో పాటు అనిరుధ్ కూడా బాలీవుడ్‌లో జెండా పాతేయాలని ఫిక్సైపోయారు.
Updated on: Feb 12, 2024 | 3:42 PM

ఎంతసేపూ సౌత్‌లోనే సంగీతం అందించుకుంటూ కూర్చుంటాం చెప్పండి.. మాక్కూడా గ్రోత్ ఉండాలి కదా అంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. అందుకే ఇన్నాళ్లూ అప్పుడప్పుడూ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

థమన్, దేవీ శ్రీ ప్రసాద్, అనిరుధ్ లాంటి సంగీత దర్శకులు.. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. వీళ్లకు అక్కడ్నుంచి వరస ఛాన్సులు వస్తున్నాయిప్పుడు. DSP, థమన్‌కు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది.

కాకపోతే వీళ్లు సినిమాలో ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే ఇస్తూ వచ్చారు ఇన్నాళ్లూ. జైహో, రెడీ, రాధే లాంటి సినిమాల్లో దేవీ శ్రీ ప్రసాద్ ఒక్కో పాటకు సంగీతం ఇచ్చారు. కానీ దృశ్యం 2తో పూర్తి ఆల్బమ్ ఇచ్చారు దేవీ.

ఇక సింబా, గోల్‌మాల్ అగైన్ లాంటి సినిమాల్లో థమన్ ఇదే చేసారు. అలాగే తాజాగా థమన్ తెరీ రీమేక్ బేబీ జాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అట్లీ నిర్మాత. ఆయన అసిస్టెంట్ ఖలీస్ దర్శకుడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక జవాన్ తర్వాత అనిరుధ్‌కు కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. మొత్తానికి దేవీ, థమన్, అనిరుధ్ అంతా సౌత్‌లో సత్తా చూపిస్తూనే.. బోనస్‌గా బాలీవుడ్‌పై ఫోకస్ పెంచేసారు.




