- Telugu News Photo Gallery Cinema photos Heroine Sreeleela start bedtime with her new flop movies in Tollywood Telugu Actress Photos
Sreeleela: శ్రీలీలకు బ్యాడ్ టైమ్ మొదలైపోయిందా.? క్రేజ్ ఎక్కువ హిట్స్ తక్కువ..
శ్రీలీల టైమ్ అయిపోయినట్లేనా.. వరస సినిమాలు చేస్తున్నా ఈమె కెరీర్ మళ్లీ గాడిన పడటం కూడా కష్టమేనా..? కృతి శెట్టి కెరీర్ మాదిరే శ్రీలీల కూడా వెనకబడబోతుందా..? మరి ఈ ఇద్దరూ సీన్‌లో లేకపోతే.. టాలీవుడ్ టాప్ సీట్ కోసం పోటీ పడుతున్న హీరోయిన్ ఎవరు..? అసలు ఇండస్ట్రీలో ఏ బ్యూటీ టైమ్ నడుస్తుందిప్పుడు..? హీరోయిన్ కెరీర్ అనేది మెడిసిన్ లాంటిది. ఎక్స్‌పైరీ డేట్‌తోనే వాళ్లు ఇండస్ట్రీకి వస్తుంటారు.. హీరోలకు ఉన్నంత లాంగ్ కెరీర్ వాళ్లకుండదు.. ఇప్పుడున్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం.
Updated on: Jan 26, 2024 | 9:20 PM

శ్రీలీల టైమ్ అయిపోయినట్లేనా.. వరస సినిమాలు చేస్తున్నా ఈమె కెరీర్ మళ్లీ గాడిన పడటం కూడా కష్టమేనా..? కృతి శెట్టి కెరీర్ మాదిరే శ్రీలీల కూడా వెనకబడబోతుందా..? మరి ఈ ఇద్దరూ సీన్‌లో లేకపోతే.. టాలీవుడ్ టాప్ సీట్ కోసం పోటీ పడుతున్న హీరోయిన్ ఎవరు..?

అసలు ఇండస్ట్రీలో ఏ బ్యూటీ టైమ్ నడుస్తుందిప్పుడు..? హీరోయిన్ కెరీర్ అనేది మెడిసిన్ లాంటిది. ఎక్స్‌పైరీ డేట్‌తోనే వాళ్లు ఇండస్ట్రీకి వస్తుంటారు.. హీరోలకు ఉన్నంత లాంగ్ కెరీర్ వాళ్లకుండదు.. ఇప్పుడున్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం.

రెండేళ్లలోనే రేసులో వెనకబడిపోతున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టితో పాటు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఉప్పెన తర్వాత వరస సినిమాలు చేసిన కృతి శెట్టి.. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ మినహా విజయాలేవీ అందుకోలేదు.

ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసినా గెలుపు పలకరించలేదు. శ్రీలీల పరిస్థితి ఇలాగే అనిపిస్తుంది. పెళ్లి సందడి, ధమాకా తర్వాత శ్రీలీలకు సరైన బ్రేక్ లేదు.. భగవంత్ కేసరి హిట్టైనా ఆమె హీరోయిన్ కాదు.. గుంటూరు కారం అంతా మహేష్ మేనియాలో వెళ్లిపోయింది.

కృతికి తెలుగులో ఆఫర్స్ లేవు.. శ్రీలీలకు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ చేతిలో ఉన్నాయి. అయితే ఇవెప్పుడు వస్తాయో క్లారిటీ లేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో మృణాళ్ టైమ్ స్టార్ట్ అయింది. హాయ్ నాన్న, సీతారామంలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి..

ఫ్యామిలీ స్టార్‌తో త్వరలోనే రానున్నారు. ఇది హిట్టైతే మృణాళ్ వైపు స్టార్స్ కన్ను పడటం ఖాయం. చూడాలిక.. ఏం జరగబోతుందో..?




