- Telugu News Photo Gallery Cinema photos Heroine Sreeleela enjoying her holiday photos viral in social media June 2024 Telugu Actress Photos
Sreeleela: అబ్బా ఏం అందం గురు.. చీరకట్టుతో వయ్యారాలు వడ్డిస్తున్న శ్రీలీల.
చేయడానికి సినిమాల్లేవు.. కొత్తగా ఇప్పుడు ఆఫర్స్ వచ్చేలా కూడా కనిపించడం లేదు.. అందుకే మన చేతుల్లో ఏం లేదు కాబట్టి ఛిల్ అవ్వడమే బెటర్ అని ఫిక్సైపోయారు శ్రీలీల. దశ తిరిగేవరకు.. దేశాలు తిరిగేద్దాం అని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు ఈ బ్యూటీ. మధ్య మధ్యలో మంచి మంచి ఫోటోషూట్స్‌తో కాలం గడిపేస్తున్నారు. తాజాగా మరో ఫోటోషూట్‌తో పిచ్చెక్కించారు ఈ భామ. ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టమే.
Updated on: Jun 06, 2024 | 4:05 PM

చేయడానికి సినిమాల్లేవు.. కొత్తగా ఇప్పుడు ఆఫర్స్ వచ్చేలా కూడా కనిపించడం లేదు.. అందుకే మన చేతుల్లో ఏం లేదు కాబట్టి ఛిల్ అవ్వడమే బెటర్ అని ఫిక్సైపోయారు శ్రీలీల.

దశ తిరిగేవరకు.. దేశాలు తిరిగేద్దాం అని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు ఈ బ్యూటీ. మధ్య మధ్యలో మంచి మంచి ఫోటోషూట్స్‌తో కాలం గడిపేస్తున్నారు. తాజాగా మరో ఫోటోషూట్‌తో పిచ్చెక్కించారు ఈ భామ.

ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టమే. దానికి శ్రీలీలనే బెస్ట్ ఎగ్జాంపుల్. గతేడాది అంతా ఈ భామదే. 2023లో కనీసం ఒక్క టూర్ వెళ్లడానికి కూడా ఈమెకు తీరిక లేదు.

స్కంద, ఆదికేశవ, భగవంత్ కేసరి, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం.. ఇలా వరసగా వచ్చేసాయి. కానీ గుంటూరు కారం తర్వాత ఫ్రీ అయిపోయారు శ్రీలీల. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే ప్రస్తుతం తెలుగులో శ్రీలీల చేస్తున్న సినిమా.

ఇది మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. ప్రస్తుతం కోలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల. ఈ మధ్యే అజిత్ సినిమాలో ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక విజయ్ సినిమాలోనూ నటిస్తుందంటున్నారు కానీ క్లారిటీ లేదు.

ఈ ఖాళీ టైమ్‌లో చదువుతో పాటు ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేసారు ఈ బ్యూటీ. రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పని చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు ఫ్రీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈమె చీరలో చేసిన ఫోటోషూట్ బాగా వైరల్ అవుతుంది.

చందమామలా మెరిసిపోతూ మతులు చెడగొడుతున్నారు శ్రీలీల. ఈ మధ్యే రవితేజ 75వ సినిమాలో శ్రీలీలకు ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ధమాకాతో బ్రేక్ ఇచ్చిన మాస్ రాజయే.. మరోసారి శ్రీలీలకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.





























