- Telugu News Photo Gallery Cinema photos Heroine Samyuktha latest stunning images in saree goes viral in internet
Samyuktha: అందంతో చందమామనైన వెంట తిప్పించుకుంటుంది ఈ భామ.. సంయుక్త పిక్స్..
సంయుక్త ప్రధానంగా మలయాళం, తెలుగు, తమిళ చిత్రాలలో కనిపించే భారతీయ నటి. ఆమె తొలిసారిగా మలయాళ చిత్రం పాప్‌కార్న్ లో నటించింది. అప్పటి నుండి ఆమె కల్కి, ఎడక్కాడ్ బెటాలియన్ , భీమ్లా నాయక్ , బింబిసార, గాలిపాట 2, సార్, విరూపాక్ష వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో కనిపించింది. తాజాగా సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Aug 30, 2024 | 3:13 PM

11 సెప్టెంబర్ 1995న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించింది సంయుక్త . తత్తమంగళంలోని చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది.

ఈ ముద్దుగుమ్మ 2016లో మలయాళ చిత్రం పాప్‌కార్న్‌తో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. తర్వాత తమిళ భాషా యాక్షన్ థ్రిల్లర్ కలారిలో తేన్మొళిగా కనిపించింది ఈ బ్యూటీ. ఇది ఆమె తోలి తమిళ చిత్రం.

ఆమె తర్వాత ఫిబ్రవరి 2022లో విడుదలైన భీమ్లా నాయక్‌లో నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. తర్వాత తెలుగులో బింబిసారలో కథానాయకిగా నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది.

తర్వాత సార్ సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో ధనుష్ తో జోడిగా కనిపిచింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన విరూపాక్ష సినిమాతో నటవిశ్యరూపం చూపించి ప్రేక్షకులను భయపెట్టింది.

ఇటీవల లవ్ మీ ఈఫ్ యూ డేర్ అనే సినిమాలో అదితి పాత్రలోకనిపించింది. ప్రస్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా చేస్తున్న స్వయంభూ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది ఈ కోమలి. ఇంకా మరో రెండు ఇతర భాష చిత్రాలు చేస్తుంది.




