- Telugu News Photo Gallery Cinema photos Heroine Remuneration are decreasing day by day know the reason why
భారీగా పడిపోయిన హీరోయిన్స్ రెమ్యునరేషన్… కారణం అదేనా ??
హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఒకేసారి ఢమాల్ పడిపోవడం వెనక అసలు కారణమేంటి..? కోట్లలో ఉన్న పారితోషికాలు కాస్తా లక్షల్లోకి ఎందుకొచ్చాయి..? గొంతెమ్మ కోర్కెలు కోరుతూ.. కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్లు..? పడిపోయిన నాన్ థియెట్రికల్ రైట్స్.. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయా..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Dec 20, 2024 | 9:30 PM

హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఒకేసారి ఢమాల్ పడిపోవడం వెనక అసలు కారణమేంటి..? కోట్లలో ఉన్న పారితోషికాలు కాస్తా లక్షల్లోకి ఎందుకొచ్చాయి..? గొంతెమ్మ కోర్కెలు కోరుతూ.. కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్లు..? పడిపోయిన నాన్ థియెట్రికల్ రైట్స్.. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయా..?

ఆ హీరోయిన్ 4 కోట్లు తీసుకుందంట.. ఈ హీరోయిన్ 3 కోట్లు తీసుకుందంటూ ఇండస్ట్రీలో నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికీ కోటి రూపాయల పారితోషికం అందట్లేదు. సడన్‌గా పడిపోయిన ఓటిటి రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తుంది.

నాన్ థియెట్రికల్ బూమ్‌లో ఉన్నపుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు. కానీ ఓటిటి స్ట్రీమింగ్స్‌కి ముందున్నంత డిమాండ్ లేదిప్పుడు. పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపు వెళ్తుంది.

దాంతో నాన్ థియెట్రికల్ సేలబుల్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది. అందుకే తమన్నా, కీర్తి సురేష్, కాజల్, రాశీ ఖన్నా లాంటి బ్యూటీస్ ఓటిటిలోనూ పెద్దగా కనిపించట్లేదిప్పుడు.

కరోనా టైమ్‌లో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటిటి వైపు వెళ్లారు. కానీ డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయిందిప్పుడు. ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు. పైగా శ్రీలీల లాంటి వాళ్లేమో ఒక్క సీజన్‌కే పరిమితమవుతున్నారు. ఏ హీరోయిన్‌కు స్టాండర్డ్ మార్కెట్ లేదు. పూజా హెగ్డే, సమంత, తమన్నా ముందులా మెరవట్లేదు. అందుకే ఒకప్పట్లా హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు.