- Telugu News Photo Gallery Cinema photos Heroine Priyanka Mohan Special Focus on Tollywood movies and shooting updates on September 2024 Telugu Actress Photos
Priyanka Mohan: హీరోయిన్ల జాతకం మారిపోవాలంటే తెలుగు సినిమాలో చెయ్యాల్సిందే.! ప్రియాంక మోహన్ న్యూ
హీరోయిన్లకు సింగిల్ సినిమా చాలు జాతకం మారిపోడానికి. ఇప్పుడు ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ భామకు.. వరస ఆఫర్స్ స్వాగతం పలుకుతున్నాయి. ఆల్రెడీ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఆ హీరోయిన్‌కు.. తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్.? టాలీవుడ్‌లో మెల్లగా మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్. ప్రస్తుతం తెలుగులో ఈమెకు వరస ఛాన్సులు వస్తున్నాయి.
Updated on: Sep 27, 2024 | 8:41 PM

హీరోయిన్లకు సింగిల్ సినిమా చాలు జాతకం మారిపోడానికి. ఇప్పుడు ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్న ఈ భామకు.. వరస ఆఫర్స్ స్వాగతం పలుకుతున్నాయి.

ఆల్రెడీ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఆ హీరోయిన్‌కు.. తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్.? టాలీవుడ్‌లో మెల్లగా మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్.

ప్రస్తుతం తెలుగులో ఈమెకు వరస ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో ఓజీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. OG సెట్స్‌పై ఉన్నపుడే నాని సరిపోదా శనివారంలో ఆఫర్ అందుకున్నారు.

ఇది హిట్ అవ్వడంతో ప్రియాంక రేంజ్ మరింత పెరిగిపోయిందిప్పుడు. ఓజి షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించట్లేదు. ఈ గ్యాప్‌లోనే సరిపోదా శనివారం పూర్తి చేసారు ప్రియాంక.

తెలుగుతో పాటు తమిళంలోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. అక్కడ జయం రవితో నటిస్తున్న బ్రదర్ దివాళికి విడుదల కానుంది. అలాగే ధనుష్ సినిమాలో ఈమె చేసిన గోల్డెన్ స్పారో సాంగ్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది.

ప్రియాంక మోహన్‌కు తెలుగు నుంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా అనుదీప్ కేవీ, విశ్వక్ సేన్ సినిమాలో ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.

దీంతో పాటు మరో సినిమాలోనూ ప్రియాంక ఫైనల్ అయ్యారని తెలుస్తుంది. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఖతర్నాక్ ప్రాజెక్ట్స్‌తో ఫామ్‌లోకి వచ్చారు ఈ బ్యూటీ.




