- Telugu News Photo Gallery Cinema photos Heroine Kangana Ranaut emergency movie censor board review, details here Telugu Actress Photos
Kangana Ranawat-Emergency: కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఎమర్జెన్సీ సినిమాకు కష్టాలు తొలిగిపోయినట్లేనా..? కంగనా రనౌత్ కలల సినిమా ఇప్పటికైనా విడుదలవుతుందా..? సెన్సార్ చిక్కులు.. కోర్టు సమస్యల నుంచి ఎమర్జెన్సీకి ఊరట లభించిందా.? తాజాగా బాంబే హై కోర్టులో ఏం జరిగింది.? కంగన సినిమాపై కోర్ట్‌కు సెన్సార్ బోర్ట్ ఏం చెప్పింది..? దానికి నిర్మాతలు ఇచ్చిన రిప్లై ఏంటి..? ఎమర్జెన్సీ సెన్సార్ విషయమై బాంబే హై కోర్టులో విచారణ జరిగింది.
Updated on: Sep 27, 2024 | 9:02 PM

ఎమర్జెన్సీ సినిమాకు కష్టాలు తొలిగిపోయినట్లేనా..? కంగనా రనౌత్ కలల సినిమా ఇప్పటికైనా విడుదలవుతుందా..? సెన్సార్ చిక్కులు.. కోర్టు సమస్యల నుంచి ఎమర్జెన్సీకి ఊరట లభించిందా.? తాజాగా బాంబే హై కోర్టులో ఏం జరిగింది.?

కంగన సినిమాపై కోర్ట్‌కు సెన్సార్ బోర్ట్ ఏం చెప్పింది..? దానికి నిర్మాతలు ఇచ్చిన రిప్లై ఏంటి..? ఎమర్జెన్సీ సెన్సార్ విషయమై బాంబే హై కోర్టులో విచారణ జరిగింది.

సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్స్ తొలగిస్తే గానీ.. సర్టిఫికెట్ ఇవ్వలేమని కోర్టుకు వివరించింది సెన్సార్ బోర్డు. దీనిపై సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ రోజే ఎమర్జెన్సీ విడుదలపై క్లారిటీ రానుంది. మొదట్నుంచే ఎమర్జెన్సీపై వివాదాలున్నాయి.

తప్పుడు చరిత్ర చూపిస్తున్నారని.. సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రం ఉందనీ.. వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని.. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది.

మధ్యప్రదేశ్ హై కోర్టు కూడా వాళ్ళ మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డ్‌కు సూచించింది. అక్కడ్నుంచే ఎమర్జెన్సీ సెన్సార్ కష్టాలు డబుల్ అయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ని తాము ఆదేశించలేమని బాంబే హై కోర్టు తీర్పునిచ్చింది.

తాజాగా సెన్సార్ బోర్డ్ ఇచ్చిన వివరణతో ఏకీభవించిన బాంబే హై కోర్టు.. నిర్ణయం పూర్తిగా నిర్మాతలకే వదిలేసింది. సెప్టెంబర్ 30 లోపు సెన్సార్ బోర్డ్ సూచించిన సీన్స్ తొలగిస్తే.. ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది.. లేదంటే సస్పెన్స్ ఇంకొన్నాళ్లు కంటిన్యూ అవుతుంది.




