- Telugu News Photo Gallery Cinema photos Lady Power Star Sai Pallavi Craze on Social Media goes viral on September 2024 Telugu Actress Photos
Sai Pallavi Craze: సోషల్ మీడియాలో సాయి పల్లవి హవా.! లేడీ పవర్ స్టార్ మార్క్ అంటే ఇది.!
ట్రెండింగ్ అంటే మాకిష్టం.. నేను ట్రెండింగ్ మంచి ఫ్రెండ్స్.. సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్ అవ్వడం.. వైరల్ అవ్వడం ఎలాగో నాకు తెలుసు.! ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌కు ఈ మాటలు బాగా సరిపోతాయి. ఎన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆ భామ దూకుడు మామూలుగా ఉండదు. ఇంతకీ ఎవరా హీరోయిన్.? కొంతమంది హీరోయిన్లను ఒక్క ఇండస్ట్రీకే పరిమితం చేయలేము.
Updated on: Sep 27, 2024 | 8:26 PM

ట్రెండింగ్ అంటే మాకిష్టం.. నేను ట్రెండింగ్ మంచి ఫ్రెండ్స్.. సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్ అవ్వడం.. వైరల్ అవ్వడం ఎలాగో నాకు తెలుసు.! ఇండస్ట్రీలో ఓ హీరోయిన్‌కు ఈ మాటలు బాగా సరిపోతాయి.

ఎన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆ భామ దూకుడు మామూలుగా ఉండదు. ఇంతకీ ఎవరా హీరోయిన్.? కొంతమంది హీరోయిన్లను ఒక్క ఇండస్ట్రీకే పరిమితం చేయలేము.

సాయి పల్లవి కూడా అంతే. చేసింది తక్కువ సినిమాలైనా సౌత్‌లో ఈమె ఫాలోయింగ్ నెక్ట్స్ లెవల్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈమెను లేడీ పవర్ స్టార్ అని పిలుస్తున్నారు.

ఈమె కనిపించినా.. పేరు వినిపించినా ఫ్యాన్స్ గోల మామూలుగా ఉండదు. అందుకే కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్నా ఈమె ఎప్పుడూ ట్రెండింగే.

తెలుగులో నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి.. తమిళంలో శివ కార్తికేయన్ అమరన్ సినిమాలో నటిస్తున్నారు.

అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న డెబ్యూ సినిమాతో పాటు రామాయణలో సీత పాత్రలో నటిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారీ భామ.

సాయి పల్లవి సినిమాలేవీ ఇప్పట్లో రిలీజ్‌కు లేవు.. అయినా కూడా ఈమె ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం అమరన్ ఫస్ట్ సింగిల్ రాబోతుండటమే.

అందులో హీరో శివకార్తికేయన్ అయితే.. ట్రెండవుతున్నది మాత్రం సాయి పల్లవి. అందుకే మరి ఈమెను లేడీ పవర్ స్టార్ అనేది. కాస్త గ్యాప్ తీసుకున్నా.. ఇకపై వరస సినిమాలతో రానున్నారు ఈ భామ.




